పుంగనూరులో 16 అంగన్‌వాడీ ఉద్యోగాలకు ధరఖాస్తు చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు , పెద్దపంజాణి మండలాల్లో ఖాళీగా ఉన్న 16 ఉద్యోగాలకు ధరఖాస్తులు చేసుకోవాలని ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్ ఆఫీసర్‌ భారతి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ పిడి నాగశైలజ ఆదేశాల మేరకు పుంగనూరు మండలం మోదుగులపల్లెలో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు బీసీలకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేట ఓసీలకు, నల్లగుట్లపల్లెతాండ ఎస్టీలకు, నక్కబండలో మిని అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు బీసీలకు, యల్లారుబైలు అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టు ఓసీలకు, ప్రసన్నయ్యగారిపల్లె సహాయకురాలి పోస్టు బీసీలకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే పెద్దపంజాణి మండలం కరసనపల్లె కార్యకర్త పోస్టు ఓసీలకు, బెరబల్లి, కొళతూరు,గుండ్లపల్లె-1, పెద్దకాప్పల్లె సహయకురాలు పోస్టులు ఓసీలకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే రాయలపేట-2 ఎస్సీలకు, రాయలపేట-3 ఓసీలకు, నేలపల్లి ఓసీలకు, ఎస్‌ఆర్‌.పేట బీసీలకు, కరసనపల్లె సహయకురాలు పోస్టు ఓసీలకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ పోస్టులకు ఆసక్తి గల మహిళలు తమ పూర్తి రికార్డులతో జూన్‌ 6వ తేదీలోపు ధరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

 

Post Midle

Tags: Apply for 16 Anganwadi jobs in Punganur

Post Midle