Are you ashamed of those words: Manikalala Rao

ఆ మాటలకు సిగ్గుపడుతున్నా: మాణిక్యాలరావు

Date : 04/01/2018

తాడేపల్లిగూడెం ముచ్చట్లు:

గాయకుడు గజల్ శ్రీనివాస్ వీడియోలు చూసి షాకయ్యానని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం ఆయన తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నానన్నారు. శ్రీనివాస్ మంచివాడనుకొని ఆయనకు అనుకూలంగా బుధవారం మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ‘‘నా వ్యాఖ్యల అనంతరం కొందరు కలిశారు. తర్వాత వీడియోలు చూసిన నేను షాకయ్యా. నేను మాట్లాడిన దానికి సిగ్గుపడుతున్నా. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను’’ అని మంత్రి అన్నారు. అంతేగాక గజల్ శ్రీనివాస్‌లో ఇన్నాళ్లు నా‌ణేనికి ఓ వైపే చూసానని, ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తని అనుకోలేదని అన్నారు. ‘‘ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు. ఆయనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. గజల్ శ్రీనివాస్ కేసులో ఏదో కుట్ర దాగి ఉందని, గజల్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసనీ మంత్రి మాణిక్యాలరావు బుధవారం విలేకరులతో అన్న విషయం తెలిసిందే.

Tags : Are you ashamed of those words: Manikalala Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *