Arrested by accused in woman murder case

మహిళ హత్య కేసులో నిందితులు అరెస్ట్

Date:14/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండల పరిధిలోని శివాడి గ్రామంలో జనవరి 6న ఎ.లక్ష్మి(28) అనే మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి పోలీసుల కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పోలీసులో దర్యాప్తులో గంగవరం మండలం జంగాలపల్లెకు చెందిన ఇద్దరు నిందితులు ఎంపి.భరత్‌, సి.కిరణ్‌లను మండలంలోని కోగిలేరు క్రాస్‌ వద్ద గంగవరం సిఐ మధుసూదన్‌రావు అరెస్ట్ చేశారు.ఈ మేరకు సీఐ నిందితులను విచారించగా కుటుంబ కలహాల కారణంతోనే ఈ హత్య చేసినట్లు తెలిపారు. హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినందుకు సీఐ మధుసూదన్‌రావు, పెద్దపంజాణి ఎస్‌ఐ చంద్రమోహన్‌, సిబ్బందిని జిల్లాఎస్పీ రాజశేఖర్‌బాబు, పలమనేరు డిఎస్పి చౌడేశ్వరి అభినందించారు.

Tags : Arrested by accused in woman murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *