తవ్వే కోద్ది టాలీవుడ్ లో కొత్త విషయాలు

Date:18/06/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. ఆ కేసులో తెలుగు చిత్ర నిర్మాత మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళను అరెస్టు చేశారు. అయితే ఆ కేసుకు సంబంధించి 42 పేజీల ఫిర్యాదును నమోదు చేశారు. చికాగో జిల్లా కోర్టులో ఈ కేసును విచారిస్తున్నారు. రహస్యంగా సెక్స్ రాకెట్ నడిపిన కిషన్.. టాలీవుడ్ నుంచి కనీసం అయిదు మంది హీరోయిన్లను వ్యభిచారంలోకి దించినట్లు ఓ రిపోర్ట్‌లో తేలింది. సెక్స్ రాకెట్లోకి దిగిన ప్రతి తారకి చెందిన అకౌంట్ వివరాలు అన్నీ కిషన్ దగ్గర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడెక్కడ కస్టమర్‌ను కలుసుకున్నారు, ఎవరి వద్ద ఎంత వసూల్ చేశారన్న అంశాలన్నీ కిషన్ దగ్గరే ఉన్నాయి. ప్రతి హీరోయిన్‌కి ప్రత్యేకంగా అతను లెడ్జర్‌ను మెయిన్టేన్ చేశాడు. చికాగోని బెల్మోంట్ క్రెయిన్ ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్లలో తారలు తలదాచుకునే విధంగా అతను ఏర్పాట్లు చేశాడు. డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ లాంటి నగరాల్లో ఉన్న హోటల్స్‌లో క్లయింట్లను కలిసినట్లు సమాచారం ఉంది. సెక్స్ రాకెట్ గురించి బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు హీరోయిన్లను అతను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చికాగోలోని వెస్ట్ బెల్డన్ అవెన్యూలో ఉన్న 5700 బ్లాక్‌లో ఆ తారలకు చెందిన లెడ్జర్లు దొరికినట్లు ఫెడరల్ పోలీసులు చెప్పారు. సెక్స్ రాకెట్ నడిపిస్తున్న భార్యాభర్తలను వారెంట్‌తోనే వాషింగ్టన్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో తెలుగు అనుమాదకుడి ద్వారా కిషన్ కోర్టుకు హాజరైనట్లు తెలిసింది. కిషన్ దంపతులకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వాళ్ల తరపున వాదిస్తున్న అటార్నీ మొలీ ఆర్మోర్ తెలిపారు. ప్రస్తుతానికి నిందితులను కస్టడీలోనే ఉంచాలని మెజిస్ట్రేట్ జడ్జి మారియా వాల్డేజ్ ఆదేశించారు. నిందితుల ఇద్దరు పిల్లలు మాత్రం వర్జీనియాలోని చైల్డ్ వెల్ఫేర్ అధికారుల వద్ద ఉన్నారు.
Tags:Arrested by MPs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *