అసదుద్దీన్ ఒవైసీ కేంద్రం భద్రతను నిరాకరించారు: కేంద్ర హోం మంత్రి అమిత్‌

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
 
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కేంద్రం భద్రత కల్పించినా ఆయనే నిరాకరించారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభకు తెలిపారు. యూపీలోని మీరట్‌లో ఒవైసీ కారుపై దుండగులు ఇటీవల కాల్పులు జరిపిన ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై అమిత్‌షా రాజ్యసభలో ఒక ప్రకటన చేస్తూ, ఘటన జరిగిన వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకున్నామని చెప్పారు. దీనికి ముందు కేంద్ర భద్రతా సంస్థల సమాచారం మేరకు ఒవైసీకి భద్రత కల్పించాలని కేంద్రం ఆదేశించినట్టు చెప్పారు. అయితే, అందుకు ఒవైసీ ఇష్టపడలేదని, ఢిల్లీ, తెలంగాణ పోలీసులు ఆయనకు భద్రత కల్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదని చెప్పారు. దీంతో ఒవైసీ భద్రతను మరోసారి అంచనా వేసి ఒక బుల్లెట్ ఫ్రూవ్ కారు, జడ్ కేటగిరి సెక్యూరిటీ కేటాయించామని తెలిపారు. అప్పుడు కూడా ఒవైసీ నిరాకరించినట్టు సభకు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కల్పించిన భద్రతకు ఒవైసీ సమ్మతించాలని విజ్ఞప్తి చేశారు.
 
Tags; Asaduddin Owaisi denies Center security: Union Home Minister Amit

Natyam ad