అసదుద్దీన్ ఒవైసీ యూపీ  సభ రద్దు

లక్నో ముచ్చట్లు:
 
మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం యూపీలో జరగాల్సిన సభ రద్దు అయింది. యూపీ రాష్ట్రంలోని లోని పట్టణంలో శనివారం జరగాల్సిన బహిరంగ సభకు పోలీసులు
అనుమతి నిరాకరించారు. దీంతో లోని పట్టణంలో జరపాల్సిన ఎన్నికల ప్రచార సభను రద్దు చేస్తున్న మజ్లిస్ పార్టీ ప్రకటించింది. ముందుగా అనుకున్న ప్రకారం ఛప్రౌలి పట్టణంలో జరిగే మరో బహిరంగసభలో
అసదుద్దీన్ ప్రసంగించనున్నారు.ఒవైసీ ప్రయాణిస్తున్న కారుపై గురువారం కాల్పులు జరిపిన నిందితుడికి పిస్టల్ మీరట్ నగరంలోని ఓ వ్యక్తి నుంచి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒవైసీ కారుపై
కాల్పులు జరిపిన ఓ వ్యక్తికి మీరట్ వ్యక్తి పిస్టల్ ఇచ్చారని తేలడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద సచిన్,
శుభంలు సమీపం నుంచి కాల్పులు జరిపారు. నోయిడా నివాసి సచిన్ నుంచి 9 ఎంఎం పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
Tags: Asaduddin Owaisi dissolves UP assembly

Natyam ad