ఏపీ సచివాలయం వద్ద అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్యయత్నం: నాలుగోసారి

గుంటూరు ముచ్చట్లు:
ఏపీ సచివాలయంలో వద్ద అక్కచెల్లలు ఆత్మహత్య యత్నం చేశారు.కర్నూలు జిల్లా నంద్యాల కు చెందిన షకీరా (25),ఫాతిమా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. గత కొంత కాలం క్రితం తండ్రి చనిపోవడంతో ఉద్యోగం తనకు కేటాయించాలని కుటుంభ సభ్యులు సచివాలయం కు వచ్చారు.
సచివాలయం వద్ద సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతిచకపోవడం తో మనస్తాపానికి గురై తన తో పాటు తెచ్చుకున్న పురుగులు మందు తాగారు.ఎన్నో సార్లు అధికారులను కలిసిన ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తోంది.వీరు తరచూ ఆత్మహత్యా యత్నం చేస్తుండగా,గత రెండు నెలలో ఇది నాలుగో ఆత్మహత్య యత్నం అని తెలుస్తుంది. భాధితులను మంగళగిరి లో ఆసుపత్రికి తరలించగా పరిస్థితి స్థిరం గా ఉన్నట్టు తెలుస్తోంది.డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు.
Tag : At the Secretariat of AP, sisters are suicidal: fourth time


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *