భార్యపై హత్యాయత్నం

కర్నూలు ముచ్చట్లు:
 
కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొణిదేడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.భార్య  పై అనుమానం తో భర్త దాడి చేసి పురుగుల మందు తాగించి హత్య చేయ్యడానికి ప్రయత్నించిన ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. భార్య పై తల్లితో కలిసి భర్త దాడి చేయడంతో భార్య సరస్వతి కి గాయాలయ్యాయి.దాడి ఘటన ను చూసి ఇంట్లో పిల్లలు కేకలు వేయ్యడంతో భర్త,అత్త ఇద్దరు పరారయ్యారు.అపస్మారక స్దితిలో ఉన్న వివాహితను స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొనిదెడు గ్రామానికి చెందిన వెంకటసుబ్బన్న కు నంద్యాల కు చెందిన సరస్వతి తో 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక  కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.పెళ్ళయినప్పటి నుండి భార్య సరస్వతి ని భర్త వెంకట సుబ్బన్న అనుమానం తో వెదిస్తూ ఉండేవాడు. అదే క్రమంలో  భార్య మీద అనుమానం తో భర్త వెంకట సుబ్బన్న,అత్త ఆదిలక్ష్మి ఇద్దరు కలిసి గొంతుకు బట్టకట్టి పురుగుల మందు నోట్లో పోసి హత్య చేసేందుకు ప్రయత్నించారని బాధిత మహిళ ఆరోపించింది.అదే సమయంలో ఇంట్లో ఉన్న పిల్లలు కేకలు వేయడంతో  భర్త,అత్త లు పరారయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న వివాహిత ను స్థానికులు చికిత్స కోసం నంద్యా ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Attempted murder on wife

Natyam ad