ఏటీఎంలో చోరీకి యత్నం

– పోలీసుల అప్రమత్తతో  తప్పిన ముప్పు.
 
మంచిర్యాల ముచ్చట్లు:
 
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం లో దొంగతనానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున నలుగురు దుండగులు ఎస్బిఐ
ఏటీఎం లోకి చొరబడి. గ్యాస్ కట్టర్ లతో ఏటీఎం మెషిన్ ను కట్ చేశారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో జైపూర్ ఏసీపీ నరేందర్ వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన బ్లూ కోట్
సిబ్బందితో కలసి అక్కడికి చేరుకునే లోపు దొంగలు నగదు, గ్యాస్ కట్టర్ వదిలి పారిపోయరు. ఆ సమయంలో ఏటీఎం యంత్రం లో 22 లక్షల 40 వేల రూపాయల నగదు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా
చోరీ కాకపోవడం పట్ల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సీసీ పుటేజ్ లోని దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
 
Tags: Attempted theft at ATM

Natyam ad