గోకవరంలో పంచాయితీలో వేలం పాటలు- సెక్రటరీ టంకాల శ్రీనివాస్ రావు..

గోకవరం ముచ్చట్లు:
గోకవరం పంచాయితీ పరిధిలో ఆరు రకాల వేలం పాటలు ఉన్నాయని, ఇందులో రెండు పాటలు పూర్తి అయినట్లు సెక్రటరీ టంకాల శ్రీనివాస్ రావు తెలిపారు.. వారపు పశువుల సంత, మేకల సంత, కూరగాయలు మార్కెట్, రోజువారీ మార్కెట్, మేక, పంది కబేళ, పాత న్యూస్ పేపర్లు వేలం పాట జరుగుతుందని చెప్పారు.. ఇందులో కూరగాయలు సంత, రోజువారీ మార్కెట్ కు వేలం పాట నిర్వహించినట్లు చెప్పారు.. కూరగాయల సంత ఏడు లక్షల ఆరు వేల రూపాయలకు పాడుకున్నారని, రోజువారీ సంత ఆరు లక్షలకు పాడుకున్నట్లు చెప్పారు.. మిగిలిన నాలుగింటికి 11 తేదీన నిర్వహిస్తామని చెప్పారు.. గత సంవత్సరం వారపు పశువుల సంత మూడు లక్షల ఎనభై ఒక్క వేలకు వెళ్లిందని, మేకల సంత ఆరు లక్షల ఎనభై అయిదు వేలకు పాడినట్లు చెప్పారు.. ఈ సంవత్సరం ఎంతవరకు వెళ్తుందో చూడాలి అన్నారు..
 
Tags:Auction songs in Gokavaram panchayat- Secretary Tankala Srinivas Rao

Natyam ad