ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.

బద్వేలు ముచ్చట్లు:
బద్వేల్ టౌన్ నందు ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలలో భాగంగా ఆటో డ్రైవర్ లకు కౌన్సిలింగ్ చేసిన  బద్వేల్ అర్బన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ K. రామచంద్ర
బద్వేల్ టౌన్ నందు ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలలో భాగంగా గురువారం  బద్వేల్ అర్బన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ K. రామచంద్ర బద్వేల్ అర్బన్ పోలీసు స్టేషన్ లో బద్వేల్ టౌన్ లోని ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించినారు. ఈ సందర్భాగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదు. తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
తప్పనిసరిగా ఇన్స్యురెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.డ్రైవర్ సీటు ప్రక్కన అదనపు సీట్లు పెట్టుకొని ప్రయానికులను ఎక్కించుకోరాదు. మోటార్ వాహనాల చట్టం నిభందలనలు తప్పనిసరిగా పాటించాలి.  పై నిభందనలు ఉల్లంగించిన వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
 
Tags:Auto drivers must obey traffic regulations

Natyam ad