ఆటో బోల్తా..నలుగురికి గాయాలు

Date:17/11/2018
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారు విఎన్  పురంలో ఒక ఆటో బోల్తా పడి నలుగురికి గాయాలయ్యాయి. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన లో ఆటో ప్రయాణికులకు తృటిలో ప్రాణపాయం తప్పింది.  మితిమీరిన వేగంతో వస్తున్నా ఆటో మలుపు తిరగడంలో అదుపు తప్పింది. దాంతో ఎదురుగా వస్తున్న సైకిలిస్టును ఢీ కొట్టి బోల్తా పడింది. రోడ్డు పక్కన వున్న గ్యాస్ పైపులు అడ్డుకోక పోతె పక్కన ఉన్న చేరువులోకి పడిపోయేది. ఆటోలో ఉన్న ఇద్దరు స్కూల్ విద్యార్థులు, సైకిలిస్టు, ఆటో డ్రైవర్ గాయపడ్డారు.  గాయపడిన వారిని వేరే ఆటోలో చికిత్స కోసం తరలించారు.
Tags: Auto roll over

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *