పంట నాశన క్రిములను నివారించుకోవాలి  – వ్యవసాయ అధికారిణి పరమేశ్వరి

పెద్దపంజాణి ముచ్చట్లు :

పంటలను నాశనం చేసే చీడపీడలను, క్రిమి కీటకాలను అరికట్టడానికి ముందుగానే నివారణ చర్యలను తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి పరమేశ్వరి సూచించారు. మండల పరిధిలోని దిన్నెపల్లె గ్రామంలో ఆమె పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె కంది పంటకు సోకే మరక మచ్చల పురుగు నివారణకు చేపట్టవలసిన చర్యలను రైతులకు తెలిపారు. ఒక లీటరు నీటికి 2.5 మిల్లీల చొప్పున క్లోరిపైరిఫాస్ ను, నువాన్ 1 మిల్లీ చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా  కంది పంటకు సోకే చీడపీడలను నివారించవచ్చని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్ పాల్గొన్నారు.

Tag : Avoid crop damage


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *