Awareness Congress: MLCs Karineppalkar

ఓర్వలేని కాంగ్రెస్ : ఎమ్మెల్సీలు కర్నేప్రభాకర్ 

Date:19/06/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
తెరాస  ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాల తో కాంగ్రెస్ నేతల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి . అధికారం కనుచూపు మేరలో లేదని గ్రహించి ఉత్తమ్ తదితర కాంగ్రెస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కర్నా ప్రభాకర్ మండిపడ్డారు. రైతుల కళ్ళలో ఆనందాన్ని చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉత్తమ్ మాటలను నమ్మడం లేదు. సీఎం కెసిఆర్ మడమ తిప్పని యోధుడిలా పథకాలు అమలు చేస్తున్నారు. సొంత పార్టీ ని చక్కదిద్దుకోలేని ఉత్తమ్ తెరాస పార్టీ , సీఎం కెసిఆర్ పై మాట్లాడుతున్నారు. విభజన చట్టం హామీల విషయం లో సీఎం కెసిఆర్ రాజీ లేని పోరాటం చేస్తున్నారు. ఎపుడు కెసిఆర్ ఢిల్లీ వెళ్లినా కేంద్రం తో విభజన హామీల పై చర్చిస్తున్నారు. తెరాస ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ..తెలంగాణ ప్రజల కోణం లోనే కెసిఆర్ నిర్ణయాలుంటాయి. కేంద్రప్రభుత్వం తో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ పరమైన సంబంధాలు కచ్చితంగా ఉంటాయి. రిజర్వేషన్ల పై ఉభయ సభల్లో తీర్మానం చేసి పార్లమెంటు కు పంపామని అన్నారు. రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ ను సాధించిన ఘనత కెసిఆర్ ది. ఇపుడు కూడా రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ కు కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలు సాధించుకుంటాం. ముస్లిం మైనార్టీల ప్రయోజనాల కోసం సచార్ కమిటీ నివేదిక ను అమలు చేయాలని గట్టిగా పట్టుబట్టింది కెసిఆర్ యే అని గుర్తు చేసారు. సచార్ నివేదిక ను అమలు చేయాలని రోడ్లపై కి వచ్చింది  మాత్రమే. చీకటి ఒప్పందాలు ,రహస్య ఒప్పందాలు కాంగ్రెస్ కు అలవాటు ,కెసిఆర్ కు ఆ అలవాటు లేదు. తెలంగాణ సాధించుకున్నట్టే రిజెర్వేషన్ల పెంపును సాధించుకుంటాం.. మా తెగింపు ధోరణి ని కొనసాగిస్తామని అన్నారు.  ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ముందు ఉత్తమ్ ఆరోపణలు దూది పింజల్లా ఎగిరిపోతాయి. కాంగ్రెస్ మద్దతు తో కర్ణాటక సీఎం అయిన కుమారస్వామి కూడా పీఎం మోడీ తో కలిశారు ..ఆయన కూడా మోడీ తో కుమ్మక్కయ్యారంటున్నారా ? రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకునే వరకు సీఎం కెసిఆర్ ఎన్ని సార్లయినా ప్రధాని మోడీ ని కలుస్తారు. ముస్లిం లను కాంగ్రెస్ మరమనుషుల్లా ,ఓటు బ్యాంకుల్లా వాడుకుంది. మైనారిటీ ల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను trs సర్కార్ అమలు చేస్తోంది.  తమ లాలూచి విధానాలానే  కొనసాగిస్తోందని కాంగ్రెస్ అనుకుంటే అది ఆ పార్టీ భ్రమ అని అన్నారు.
Tags; Awareness Congress: MLCs Karineppalkar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *