Awareness Convention on Schools Management of Schools for Teachers

ఉపాధ్యాయులకు పాఠశాలల మౌలిక సదుపాయాల నిర్వహణపై అవగాహన సదస్సు

Date : 09/12/2017
పెద్దపంజాణి ముచ్చట్లు : 
మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులకు ఆయా పాఠశాలలకు సంబంధించి మౌలిక సదుపాయాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల విద్యాధికారిణి హేమలత ఆద్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల వివరాలు, తరగతి గదుల వివరాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం తదితర అంశాలను యు – డైస్ పత్రంలో పొందుపరచిన విదంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. విద్యార్థుల గ్రేడింగ్,హాజరు శాతం, ఉపాధ్యాయుల, విద్యావాలంటీర్ల వేతన వివరాలు కూడా పట్టిక రూపంలో పొందుపరచాలని తెలిపారు. వివరాలన్నీ సెప్టెంబరు 30 వ తేదీకి సంబంధించినవి గా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక,ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags : Awareness Convention on Schools Management of Schools for Teachers


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *