బాల్య వివాహాలపై భక్తులకి అవగాహన

-న్యాయవాదులు పారా లీగల్ వాలంటరీ
 
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
మహాశివరాత్రి సందర్భంగా మండల న్యాయ అధికార సంస్థ తరఫున శ్రీకాళహస్తి గుడి ప్రాంగణము నందు బాల్య వివాహాల నిర్మూల గురించి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబెర్, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీ లు పాల్గొన్నారు. అనంతరం మహాశివరాత్రి రోజునుంచి 3 రోజులు దేవస్థానానికి వచ్చే భక్తులకీ బాల్య వివాహం చేయడం చట్ట విరుద్ధం అని అవగాహన కల్పించారు. భక్తులకు బాల్య వివాహాల కరపత్రాలు అందించారు.బాల్యవివాహం ప్రోత్సహించిన సహకరించిన కఠిన రెండు సంవత్సరాలు, లక్ష రూపాయలు జరిమానా శిక్ష గా ఉంటుంది,బాల్య వివాహము (Child Marriage) అనగా యుక్త వయసు రాక మునుపు అనగా బాల్య దశలో చేసే వివాహము. నేడు చట్ట ప్రకారము 18 సంవత్సరాల వయసు నిండని అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి జరిగే వివాహమును బాల్య వివాహముగా చెప్పవచ్చు. పూర్వము బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. దీనికి పెక్కు కారణములున్నవి. బాల్య వివాహాల ప్రభావం ఎక్కువవుంటుంది .చిన్న వయస్సులోనే వివాహాలు జరగడం వల్ల ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయస్సులోనే గర్భవతులు కావడం వారి ఆరోగ్య పరిస్థితి మరియు ఎదుగుదల తగిపోతుంది అన్నారు.కావున బాల్యవివాహం నిర్ములనకు ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. అలాగే గిరిజ సంక్షేమ పథకాల,చట్టాల గురించి అవగాహన కల్పించారు.అలాగే కోవిడ్ అధికముగా వునందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రతి రోజు మాస్క్ లు , శానిటైజర్ ఉపయోగించాలని కోరారు. మీ ఊరి లో ఏ సమస్య వున్నా మాకు తెలపండి అన్నారు. అలాగే న్యాయ సలహాలకు 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.
 
Tags: Awareness of devotees on child marriages

Natyam ad