బ్యాంకింగ్ సేవల పై రైతులకు అవగాహన సదస్సు

-వ్యవసాయ అధికారి శివశంకర్
 
మంత్రాలయం ముచ్చట్లు:
 
బ్యాంకింగ్ సేవలపై రైతులకు అవగాహన  కల్పించినట్లు వ్యవసాయాధికారి శివశంకర్  తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని బసాపురం రాంపురం మరియు కాచా పురం గ్రామాలలో  రైతులకు బ్యాంకింగ్ సేవల పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతి రైతు, రైతు భరోసా కేంద్రాలలో బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిజినెస్ కరస్పాండెంట్ బ్యాంకు సేవలు అందజేస్తారు. ముఖ్యంగా పంట రుణాలు బంగారు ఆభరణాలపై రుణాలు చదువుకోవడానికి లోన్స్ ఇస్తున్నట్లు తెలిపారు.మండల కన్వీనర్ బీమి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో   సర్పంచ్ రాఘవరెడ్డి నరసింహులు దినేష్ శేఖర్ రాఘవేంద్ర హైమావతి రైతులు తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Awareness seminar for farmers on banking services
.

Natyam ad