Awareness Summit for Entrepreneurs

పారిశ్రామిక వేత్తలకు అవగాహన సదస్సు

Date : 27/12/2017

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం 10 గంటలకు ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అనిల్‌కుమార్‌ తెలిపారు. జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏపి ఐఐసి , ఏపిఎస్‌ఎఫ్‌సి అధికారులు, బ్యాంకు మేనేజర్లు హాజరౌతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీలను తెలియజేస్తూ, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నిరుద్యోగ యువతి, యువకులు హాజరై, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన కోరారు.

Tags : Awareness Summit for Entrepreneurs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *