పుంగనూరులో విద్యార్థులకు సమగ్ర శిక్షణపై అవేర్‌నెస్‌ వీక్‌

పుంగనూరు ముచ్చట్లు:
 
మోడల్‌ స్కూల్‌లోని విద్యార్థులకు యూనసెఫ్‌ వారి ఆధ్వర్యంలో సమగ్ర శిక్షణపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ రమ తెలిపారు. సోమవారం ఆమె క్యాలెండర్‌ను ,సమగ్ర శిక్షణ పద్దతులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ విద్యార్థులకు 19వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి, అవగాహన కల్పిస్తామన్నారు. ఈ శిక్షణా తరగతులు 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు చక్కని బోధన పద్దతులను వివరించి, వారి భవిష్యత్తుకు పటిష్టమైన మార్గదర్శకులుగా కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోనియారాజు, డాక్టర్‌ హేమచంద్రిక, బాలాజి తదితరులు పాల్గొన్నారు.

Tags: Awareness Week on Comprehensive Training for Students in Punganur

Natyam ad