Babu strategies for slapping Modi

మోడీని ఢీ కోట్టేందుకు బాబు వ్యూహాలు

 Date:27/11/2018
విజయవాడ ముచ్చట్లు:
రాజ‌కీయంగా ఓ ఏడాది కింద‌టి వ‌ర‌కు క‌లిసి కాపురం చేసిన ప్రధాని న‌రేంద్ర మోడీ-టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు ఏడాది నుంచి ఉప్పు-నిప్పుగా ఉన్న విష‌యం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా స‌హా వివిధ ప‌థ‌కాలు, విభ‌జ‌న చ‌ట్టంలోని అనేక అంశాల‌ను అమ‌లు చేయ‌డం లేద‌ని, వివ‌క్ష చూపి స్తున్నార‌ని, అందుకే తాము కేంద్రంలోని ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చామ‌ని చంద్రబాబు చెబుతున్నారు. ఇక‌, ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి ధ‌ర్మ పోరాట దీక్ష పేరుతో కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు చంద్రబాబు. అంతేకాదు, అందివ‌చ్చిన ప్రతి అవ‌కాశాన్నీ వినియోగించుకుంటున్నారు. బీజేపీ ఓట‌మే ధ్యేయంగా క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ ఏడాది మేలో చంద్రబాబు తెలుగు ప్రజ‌ల‌ను బీజేపీకి ఓట్లు వేయొద్దని ఇచ్చిన పిలుపు ఢిల్లీలోని బీజేపీ నేత‌ల‌ను సైతం క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. ఇక‌, ఆ త‌ర్వాత ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. కేంద్రంపై ఉరుములు, మెరుపుల‌తో చంద్రబాబు దాడి చేస్తున్నారు.ఇక‌, తాజాగా తెలంగాణా ఎన్నిక‌ల్లోనూ బీజేపీని ఒంట‌రిని చేశారు.
బాబు నేరుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నా రు. దీంతో నిన్న మొన్నటి వ‌ర‌కు బ‌ల‌మైన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ ఊసు ఇప్పుడు తెలంగాణాలో పెద్దగా వినిపించ‌డం లేదు. ప్రస్తుతం తెలంగాణాలో .. టీడీపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ అనే రేంజ్‌లోనే ప్రచారం ఊపందుతోంది. దీంతో ద‌క్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటులో తాము కూడా కీల‌క పాత్ర పోషించామ‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే బీజేపీని నిలువునా దెబ్బకొట్టారు చంద్రబాబు. ఇంత‌టితో అయిపోయిందా మ‌రి మోడీపై బాబు కోపం అంటే.. ఏమీ లేదు. అస‌లు సిస‌లు దెబ్బలో ఏపీలోనే చూపిస్తున్నారు. ప్రపంచంలోనే పెద్ద విగ్రహంగా పేర్కొంటూ. దాదాపు వేలాది కోట్లతో నిర్మించిన స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ విగ్రహాన్ని ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా భావించారు. బ‌హుశ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న దీనిని ప్రచార అస్త్రంగా కూడా వినియోగించుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని స‌మాచారం.అయితే, చంద్రబాబు ఇప్పుడు తాజాగా మోడీ రికార్డును కూడా కాల‌రాసేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అమరావతిలో కొలువుదీరనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది.
దేశంలోనే ఎత్తైన కట్టడంగా నిలవనుంది. పటేల్ స్మృత్యర్థం నర్మదా నదీ తీరంలో నిర్మించిన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని త‌ల‌దన్నేలా చంద్రబాబు ఈ నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణమ్మ తీరంలో నిర్మిస్తున్న ఏపీ అసెంబ్లీ డిజైన్లను నార్మన్ ఫోస్టర్స్ విడుదల చేసింది. డిజైన్లను సీఎం చంద్రబాబు పూర్తిగా ఆమోదం తెలిపారు. తాజా డిజైన్ల ప్రకారం పటేల్ విగ్రహం కంటే 68 మీటర్లు ఎత్తులో ఏపీ అసెంబ్లీ నిర్మాణం ఉండనుంది.మూడు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మిస్తుండగా.. దానిపైన ఉండే టవర్ చాలా ఎత్తులో ఉండనుంది. ఎత్తులో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ 182 మీటర్లు ఉండగా, ఏపీ అసెంబ్లీ 250 మీటర్లు. ఈ నెల‌లోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నామని ప్రభుత్వం కూడా ప్రక‌టించింది. దీంతో మోడీ సాధించాన‌ని గొప్పగా చెప్పుకొంటున్న రికార్డును బాబు బ‌ద్దలు కొట్టిన‌ట్టే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ ప‌రంప‌ర‌లో మ‌రెన్ని రికార్డులు బాబు బ‌ద్దలు కొడ‌తారో చూడాలి.
Tags:Babu strategies for slapping Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *