బాబుతో కమల్  చెట్టాపట్టాల్

Date:16/02/2018
చెన్నై ముచ్చట్లు:
సినిమాలకు పుల్ స్టాప్ పెట్టారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. పూర్తి స్థాయి రాజకీయాల్లో వచ్చేందుకే ఈ పని చేశానని చెప్పాడు విశ్వనటుడు కమల్. తమిళనాడులో ఇప్పుడు విచిత్ర రాజకీయాలు నెలకున్నాయి. డిఎంకే గతం కంటే పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. కరుణానిధి మంచాన పడటంతో ఆ పార్టీపై నమ్మకాలు అంతగా లేవు. మరోవైపు జయలలిత మృతితో ఏఐడిఎంకేను అంతగా నమ్మడం లేదు. పళనిస్వామి అంతగా ఆకట్టుకోవడం లేదు. ఇక రజనీకాంత్, కమల్ హాసన్ లు పార్టీలు పెడితే వారికే పట్టం కట్టేలా ఉన్నారు జనాలు. అలాంటి సమయంలో జాతీయ స్థాయిలో తమకు ఏదో ఒక దన్ను చూసుకుంటున్నాయి ప్రాంతీయ పార్టీలు.తమిళనాడులో కమల్ హాసన్ అదే పని చేస్తున్నాడు. కమలం పార్టీతో కలిసిపోయేందుకు సిద్దంగా లేరాయన. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా మద్దతునిస్తున్నాడు. మమతా బెనర్జీని ప్రశంసలతో ముంచెత్తాడాయన. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు ఆయనకు ఆదర్శనాయకుడయ్యాడు. ఏపీ పొలిటిక్స్ తో తనకు సంబంధం లేకపోయినా చంద్రబాబు పనితీరును మెచ్చుకున్నాడు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో పార్లమెంటులో నిరసన తెలపడంలో బాబు సిద్దహస్తుడని చెప్పారు. రాబోయే కాలంలో చంద్రబాబుతో కలిసి పని చేసేందుకు కమల్ సిద్దమవుతున్నాడనే సంకేతాలు అందుతున్నాయి. టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చిన బీజేపీ స‌ర్కారు అధికారంలో ఉన్నా ఏపీకి అన్యాయం జరిగితే ఎలా ఎదురుతిరగాలో టీడీపీని చూసి నేర్చుకోవాలంటున్నాడు కమల్. చంద్ర‌బాబునాయుడు వ్యూహం చాలా బాగుందని కితాబునిచ్చాడు. కేంద్రంతో ఇలాగే పోరాడాల‌ని ఆయన మిగతా వారికి పిలుపునిచ్చారు. ఫలితంగా కమల్ చంద్రబాబుకు దగ్గరయ్యే వీలుంది. తమిళనాడులో ప్రచారానికి చంద్రబాబు, ఏపీలో ప్రచారానికి కమల్ హాసన్ వచ్చేలా ప్లాన్ చేసే అవకాశముందంటున్నారు. పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా జాతీయ పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ప్రాంతీయ పార్టీలకు వుంటుందన్నాడు క‌మ‌ల్‌. బీజేపీ లాంటి పార్టీని చూసిచూడనట్టు ఉపేక్షించే పరిస్థితి లేదంటూ చంద్రబాబు వైఖరిని ఉదాహరణగా చూపించాడు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై బీజేపీని నిలదీస్తున్న టీడీపీ, జాతీయ పార్టీతో మెలగాల్సిన వైఖరిని చెప్పకనే చెబుతున్నారని కమల్ అంటున్నాడు. తన దృష్టిలో జాతీయ- ప్రాంతీయ పార్టీల మధ్య వుండాల్సిన సంబంధం ఇదీ అని కమల్ స్పష్టం చేశాడు. బోస్టన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియాటుడే న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌హాసన్ త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించాడు. చంద్ర‌బాబుపై క‌మ‌ల్ ప్ర‌శంస‌లు కురిపించ‌డం నాలుగు నెల‌ల గ్యాప్‌లోనే ఇది రెండోసారి. అంటే, జాతీయ రాజ‌కీయాల‌లో చంద్ర‌బాబుతో క‌లిసి క‌మ‌ల్ ప‌య‌నిస్తారేమో చూద్దాం.
Tags: Babu with Kamal Chettappattal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *