పిల్ల కాలువలా మారిపోయిన భద్రగోదావరి

 Date:13/02/2018
ఖమ్మం ముచ్చట్లు:
 నిండు కుండలా గలగల పారే గోదావరి నెల రెండో వారంలోనే పిల్ల కాలువను తలపించేలా మారింది. జన జీవనానికి అవసరమైన మంచినీటిని సైతం అందించే స్థితి లేకుండా పోతోంది. ఇప్పుడే ఈ విధంగా నీరు అడుగంటుతుంటే రానున్న వేసవి కాలం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తలుచుకుంటేనే దడ పుడుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నది అంటే ఉగ్రరూపంలో ఉండటమే అందరికీ తెలుసు. రాముని పాదాల చెంత చప్పుడు చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేసవి కాలానికి ఇంకా సుమారు 15 రోజుల వ్యవధి ఉంది. కానీ ఇప్పుడే నదిలో నీరు ఎండిపోయి ఇసుక తిన్నెలు దర్శనమిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాలైన వాజేడు నుండి మొదలు పెట్టి భద్రాచలం మీదుగా కూనవరం ఉన్న సుమారు 100కు పైగా గ్రామాలు గోదావరి నీటినే సేవిస్తుంటారు. ఇప్పటికే నదిలో నీళ్లు ఉడుగంటి నీటియద్దడి ప్రారంభమైంది. అదే మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఇసుక తిన్నెలు తప్ప నీటి నిల్వలు ఉండే పరిస్థితి లేదు. ఎగువ ప్రాంతా ల్లో సైతం ఇదే తంతు కొనసాగుతోంది. ప్రస్తుత స్థితిగుతులను మననంలోనికి తీసుకుంటే రానున్న వేసవికాలంలో నీటి యద్దడి తీవ్రతరమయ్యే పరిస్థితి ఉందని పలువురు అంటున్నారు. డివిజన్ వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా ఉన్న జనాభాకు రానున్న ఎండా కాలంలో రోజుకు 5 లక్షలకు పైగా తాగునీరు అవసరం ఉంది. నది తీరు ఇలానే ఉంటే సరిపడా తాగునీరు అందతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. నీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వంచేపట్టిన మిషన భగీరధ పథకం ఇంకా కొనసాగుతూనే ఉన్నతురణంలో ఈ వేసవి కూడా శుద్ధ జలంతో గొంతుకలు తడిచేలా లేవని పెద్దలు అభివర్ణిస్తున్నారు.
Tags: Baby shield

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *