బాధాకృష్ణ ఆణిముత్యాలు

ముంబై ముచ్చట్లు:
 
అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి ముఖ్యమంత్రి పదవి నుంచి తాను తప్పుకొని తన కుమారుడికి అప్పగించాలని అనుకుంటున్నానని అందుకు మీ సహకారం కూడా కావాలని కోరారు….బాధాకృష్ణపాపం! ఈ రహస్యం అమిత్ షాకు, కేసీఆర్ కైనా తెలుసో లేదో? మరి అందుకు అమిత్ షా ఏమన్నారో కూడా బాధాకృష్ణ చెబితే బాగుండేది. మరి లోకేష్ నాయుడును ఆంధ్రాకు ముఖ్యమంత్రిని చెయ్యడానికే కదా చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కింద గోతులు తవ్వేశారు?రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత కాంగ్రెస్‌ పుంజుకుందన్న అభిప్రాయం వ్యాపించింది. అవును. రేవంత్ రెడ్డి రాకముందు హుజురాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు అరవై వేలు. రేవంత్ వచ్చాక అదే ఉపఎన్నికలో కాంగ్రెస్ కు వచ్చింది మూడు వేలు! దీన్ని బాధాకృష్ణ భాషలో పుంజుకోవడం అంటారు.ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళలో బీజేపీకి ఏ మాత్రం అవకాశం లేదు”….అయ్యయ్యో…ఈ జోస్యం చదివితే సోము వీర్రాజుకు నూటపది డిగ్రీల జొరం వస్తుందేమో! పవన్ కళ్యాణ్ జుట్టు పీక్కుంటూ చంద్రబాబు బాహుమూలల్లో ఒదిగిపోవాలనే దురాశా?జూలైలో రాష్ట్రపతి ఎన్నిక కూడా ఉన్నందున అప్పటివరకు కేసీఆర్‌ విషయంలో మోదీ–-షా ద్వయం సంయమనంతో ఉంటారని చెబుతున్నారు. రాష్ట్రంలో తనకు ఏ మాత్రం గిట్టని రేవంత్‌రెడ్డిని నిలువరించడమే కేసీఆర్‌కు ముఖ్యం. అందుకే బీజేపీపై ఆయన ప్రకటించిన జంగ్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు.
 
 
ఒకే పేరాలో రాసిన రెండు వాక్యాల మధ్య ఏమైనా పొంత ఉన్నదా?
ఇక జగన్ మీద కూడా కాసేపు భోరుభోరుమన్నాడు కానీ అందులో కొత్తేమి లేదు. జగన్ ఏ పని చేసినా ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేదే బాధాకృష్ణ విశ్లేషణా ప్రతిభ. ఇలాగే చేస్తే జగన్ పతనం ఖాయం అని కనీసం ఐదారుసార్లు నొక్కి వక్కాణించిన ఆయన జగన్ ఓడిపోతే చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని ధైర్యంగా రాయలేకపోయాడు!చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని రాస్తే తెలుగుదేశానికి ఈసారి ఆ ఇరవై మూడు కూడా రావని బాధాకృష్ణకు బాగా తెలుసు! మళ్ళీ అమరావతి, భూదోపిడీ, పదకొండు జిల్లాల ప్రజల చెమటను ఒక్క ప్రాంతం కోసం దోచిపెట్టడం..ఇవన్నీ జనానికి గుర్తొస్తాయేమో అని భయం!
 
Tags: Badhakrishna rituals

Natyam ad