వైభవంగా బాల్క సుమన్ కొత్తింటి వేడుక..!

నియోజకవర్గ ప్రజలకే తొలి ప్రాధాన్యత: బాల్క సుమన్.!

మంచిర్యాల జిల్లా: చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నూతన గృహప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఎమ్మెల్సీ దండే విఠల్, జెడ్పి చైర్ పర్సన్లు కోవ లక్ష్మీ, నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే లు దివాకర్ రావు, చిన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో సహా పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు హాజరయ్యారు. చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు తరలి వచ్చి బాల్క సుమన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో క్యాతన పల్లి రోడ్ కిక్కిరిసి పోయింది. అభిమానుల రాకపోకలతో సందడిగా మారింది. పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపించింది. నియోజకవర్గ ప్రజలకే తొలి ప్రాధాన్యత: బాల్క సుమన్.! తనను ఆదరించి అక్కున చేర్చుకున్న చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు పార్టీ కోసం అనునిత్యం కష్టపడుతున్న గులాబీ సైనికులకే తొలి ప్రాధాన్యత ఇస్తానని విప్ సుమన్ స్పష్టం చేశారు. చెన్నూరు లో క్యాంపు కార్యాలయం ఉన్నా కూడా మందమర్రి మండలం లోని గ్రామాలు, మందమర్రి మున్సిపాలిటీ, క్యాతనపల్లి మున్సిపాలిటీల ప్రజల సౌలభ్యం కోసం ఇక్కడ ఇంటిని నిర్మించుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజలకు దూర భారం లేకుండా ఉండేందుకు రెండు చోట్ల నుంచి తన కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు ఎక్కడికి వచ్చినా అవసరమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి వచ్చి తమను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు..

Natyam ad