అట్రాక్షన్ గా బెలూన్

జనగామ ముచ్చట్లు:
 
ఉత్కంఠ పరిస్థితుల మధ్య సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో శుక్రవారం పర్యటించారు.  సీఎం పర్యటన  సందర్భంగా అధికార యంత్రాంగం తోపాటు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్,  టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కెసిఆర్ పాల్గొనే బహిరంగ సభలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విమర్శలు నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తగ్గేదేలేదు ఇది కేసిఆర్ అడ్డా నినాదంతో భారీ బెలూన్ కు కేసిఆర్ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. జనగామ ను గులాబీ జెండాలతో నింపేశారు. రెండు రోజులుగా టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు అరెస్టు చేస్తున్నారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో ప్రధాని వ్యాఖ్యలు బీజేపీ నేతల తీరుపై కెసిఆర్ సమాధానం చెబుతారని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
 
Tags: Balloon as an attraction

Natyam ad