ఎన్నికలలో ర్యాలీలపై నిషేధం
న్యూఢిల్లీ ముచ్చట్లు:
వచ్చే నెల నుంచి జరుగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రచార ర్యాలీలపై నిషేధాన్ని ఫిబ్రవరి 11 వరకు పొడిగించింది. అయితే రాజకీయ పార్టీలకు ప్రచారానికి కొంత సడలింపు ఇచ్చింది=. ఇప్పుడు 500 మందికి బదులుగా, 1000 మందితో కూడిన సమావేశానికి అనుమతినిచ్చింది. అదే సమయంలో, ఇండోర్ సమావేశాలకు వ్యక్తుల సంఖ్యను కూడా 500కి పెంచారు. ఇది కాకుండా, ఇప్పుడు అభ్యర్థులు 20 మందితో ఇంటింటికీ ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Ban on rallies in elections