Banana teeth are 22 thousand tonnes

అరటి పళ్లు టన్ను 22 వేలు

Date:14/02/2018
అనంతపురం ముచ్చట్లు:
కరువు రైతుకు అరటి సిరులు కురిపిస్తోంది. టన్ను రూ.22 వేలు ధర పలుకుతుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో సుమారు 7 వేల ఎకరాల్లో అరటి తోటలు సాగుచేయగా ఆదివారం నార్పల మండలంలోని కర్ణపొడికి, వెంకటాంపల్లి, గడ్డంనాగేపల్లి, పుట్లూరు మండలం మడుగుపల్లి, జంగమరెడ్డిపేట గ్రామాల్లో టన్ను రూ.20 వేలతో కోతలు చేశారు. సోమవారం కోతకు టన్ను రూ.22 వేలు చెల్లించడానికి దళారులు అరటి రైతులకు అడ్వాన్స్‌లు చెల్లించారు. మార్చి నెలాఖరు వరకు ధర స్థిరంగా ఉంటుందని వ్యాపారులు భరోసా ఇస్తున్నారు. కాగా గత ఏడాది ఈనెలలో అరటి టన్ను రూ.6 వేలు మాత్రమే ధర పలికింది.
Tags: Banana teeth are 22 thousand tonnes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *