పుంగనూరులో జగనన్న నగర్‌లకు బ్యాంకు రుణం రూ.23.70 లక్షలు

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రభుత్వం పేద లబ్ధిదారుల కోసం నిర్మిస్తున్న జగనన్న నగర్‌లో ఇళ్ల నిర్మాణానికి ఒకొక్కరికి రూ. 35 వేలు రుణం చెక్కులను మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అందజేశారు. మంగళవారం కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ మెప్మాటౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ రవి ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తో కలసి పంపిణీ చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ పట్టణంలోని 65 మంది లబ్ధిదారులకు ఎస్‌బిఐ ద్వారా రుణం వెహోత్తం రూ.23.75 లక్షలు పంపిణీ చేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణ సదుపాయం కల్పించి , జగనన్న నగర్‌లు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్‌.లలిత , కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌, రేష్మా, నటరాజ, నరసింహులు, జేపి.యాదవ్‌, కాళిదాసు, తుంగా మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags; Bank loan to Jagannath Nagar in Punganur is Rs 23.70 lakh

Natyam ad