అనంతపురంలో బ్యాంకు దోపిడీ 

Date:28/07/2018
అనంతపురం  ముచ్చట్లు:
అనంతపురంలో భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. జేఎన్టీయూ క్యాంపస్‌కు అనుబంధంగా ఉన్న ఎస్‌బీఐలో దొంగలుపడి డబ్బు ఎత్తుకెళ్లారు. అర్థరాత్రి తర్వాత బ్యాంకు కిటికి గ్రిల్స్ తొలగించిన దొంగలు.. లోపలికి ప్రవేశించారు. వెంటనే బ్యాంక్ అలారం మోగకుండా చేసి.. రెండు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఎక్కడా వేలి ముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకొని.. గ్యాస్ కట్టర్‌తో బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌ను పగలగొట్టారు. అందులో ఉన్న రూ.39లక్షల డబ్బును ఎత్తుకెళ్లారు. ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది.. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దొంగతనం జరిగిన స్పాట్‌ను పరిశీలించారు. పాత నేరగాళ్లే ఈ చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. అలాగే బ్యాంకులోని మిగిలిన కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. అందులో బ్యాంకులోకి ఇద్దరు వ్యక్తులు చొరబడినట్లు క్లియర్‌గా రికార్డయ్యింది. ఎవరూ గుర్తుపట్టకుండా వారు మొహాలకు మాస్కులు కూడా ధరించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.
అనంతపురంలో బ్యాంకు దోపిడీhttp://www.telugumuchatlu.com/bank-robbery-in-ananthapur/
Tags: Bank robbery in Ananthapur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *