మార్చి 3 న బిసి విద్యార్థి, యువజన సదస్సు

హైదరాబాద్ ముచ్చట్లు:
 
:రాష్ట్రము లో బిసి విద్యార్థులు, నిరుద్యోగ యువకుల సమస్యలపై మార్చ్ 3 న బిసి విద్యార్ధి, యువజన సంఘాల సంయుక్త ఆద్వర్యం లో  సదస్సును నిర్వహిస్తున్నారు.ఈ మేరకు శనివారం సదస్సుకు
సంబందించిన వాల్ పోస్టర్ ను బిసి భవన్ లో బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య విడుదల చేసారు.ఈ సందర్బంగా  కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థుల పెండింగ్ లో ఉన్న ఫీజు
రీయంబస్మేంట్ ను వెంటనే విడుదల చేయాలని,రాష్ట్రము లో ఖాలిగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు తక్షనమే భర్తీ  చేయాలని డిమాండ్ చేసారు.బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్స్ అమలు
చేయాలని,విద్య ఉద్యోగాలపై ఉన్న క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని,కేంద్రం లో బిసి లకు ప్రత్యెక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో తెలంగాణా బిసి యువజన సంఘం
చర్మెన్ టైగర్ చంటి ముదిరాజ్ ,తెలంగాణా బిసి విద్యార్థి రాష్ట్ర కన్వినర్ కట్ట బబ్లు గౌడ్, బిసి ఇక్యవేదిక రాష్ట్ర అద్యక్షులు అనంతయ్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags:BC Student, Youth Conference on March 3rd

Natyam ad