మాతృబాషను అలవర్చుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:
 
సమాజంలో అవసరమైన అన్ని బాషలతో పాటు తెలుగుబాషను మరువకుండ విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. సోమవారం అంతర్జాతీయ మాతృబాష దినోత్సవాన్ని గూడూరుపల్లె జెడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎం మహేష్‌, తెలుగు పండితుడు జివి.రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగుబాష ఔనత్యాన్ని వివరిస్తూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. రమణ మాట్లాడుతూ తెలుగుబాషలో తీయ్యదనాన్ని గుర్తించాలని కోరారు. ఎన్ని తరాలు మారినా తెలుగుబాష మారదని , దీనిని గుర్తించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజరాణి, అమరనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.
 
Tags; Be accustomed to the mother tongue

Natyam ad