Be strong with confidence

అత్మవిశ్వాసంతో విజయం సాధించండి 

-విద్యార్ధులతో ప్రధాని మోడీ
Date:16/02/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో పరీక్షా పర్ చర్చాగోష్టి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఏకాగ్రత సాధిస్తే పరీక్షల ఒత్తిడిని అధిగమించగలుగుతారని ప్రధాని మోడీ అన్నారు.  ప్రధానితో మాట్లాడుతున్నారనే  విషయాన్ని మర్చిపోవాలని విద్యార్థులను కోరారు. తనను మీ స్నేహితుడిగా భావించడని కోరారు.  మనసు, బుద్ధి, శరీరం ఏకతాటిపైకి రావడమే ఏకాగ్రత అని అన్నారు. తాను కూడా నిత్య విద్యార్థినేనని ప్రధాని మోడీ అన్నారు. ఈ రోజు ఇక్కడ తాను మీతో మాట్లాడుతున్నా ఈ రోజూ తనకు పరీక్షేనని అననారు. ఏదైనా పని అనుకుంటే అది పూర్తయ్యే వరకూ దాని నుంచి దృష్టి మరల్చకూడదని మోడీ అన్నారు. విద్యార్ధులు ఆత్మ విశ్వాసం పెంపొందించుకుంటే కఠిన పరీక్షల్లో సైతం విజయం సాధించవచ్చని ప్రధాని  అన్నారు. దేశంలో పలు భాషలు ఉన్నాయనీ, ఆయా భాషలలో పిల్లల సందేహాలను తాను నివృత్తి  చేయడానికి తనకు ఆ భాష రాకపోవడం ప్రతిబంధకంగా మారిందన్నారు. అందుకే హిందీ భాషలో మాట్లాడుతున్నానన్నారు. ఇందుకు పిల్లలు తనను క్షమించాలని మోడీ అన్నారు. ఆయన మాట్లాడుతూ దేవతలను పూజించాలని పెద్దలు చెబుతుంటారు. అది మంచిదే కానీ మీలో ఆత్మ విశ్వాసం లేకపోతే దేవతలు కూడా ఏం చేయలేరన్నారు.  ఏదైనా ఒక పని చేయాలనిఅనుకుంటే దానిపై దృష్టి పెట్టాలన్నారు. చేసే పనిపై మనసు నిమగ్నం చేస్తే  ఆ పని చేయడం సులువవుతందని మోడీ  చెప్పారు.
Tags: Be strong with confidence

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *