ట్రాన్స్ జెండర్లకు అందాల పోటీలు 

Date:19/06/2018
కోచి ముచ్చట్లు:
కేరళలోని కోచిలో ‘క్వీన్ ఆఫ్ ద్వయ-2018’ పేరిట ట్రాన్స్ జెండర్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. బ్యూటీ కార్నివాల్ ఈవెంట్కు సంబంధించి.. ప్రిపరేషన్స్ కలర్ ఫుల్‌గా జరుగుతున్నాయి.  పోటీల్లో గెలుపు కోసం మోడల్స్ సన్నద్ధమవుతున్నారు. కేరళలోని ద్వయ ఆర్గనైజేషన్.. ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఆత్మస్థైర్యం నింపేందుకు అందాల పోటీలు నిర్వహిస్తోంది. పోటీల్లో భాగస్వాములం కావటం ట్రాన్స్‌జెండర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  కొచ్చిన్ అంర్జాతీయ విమానాశ్రయం సమీపాన ఉన్న సీఐఏఎల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా మలయాళ అగ్ర నటుడు మమ్మూటీ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి సినీ తారలు జయసూర్య, నదియా, పద్మప్రియ, మమతా మోహన్‌దాస్, అమలాపాల్, లక్ష్మీ గోపాలస్వామి, రీమా కళింగల్ తదితరులు హాజరయ్యారు.
Tags:Beauty contestants for transgender

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *