నాకు గురువులు పెట్టిన బిక్ష నైటింగేల్‌ అవార్డు-బ్రిగేడియర్‌ సరస్వతి వెల్లడి

పుంగనూరు ముచ్చట్లు:
 
నాకు చదువునేర్పించిన గురువులు , కన్నతల్లిదండ్రుల బిక్షతోనే తనకు అత్యున్నతమైన నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవిద్‌ చేతులు మీదుగా స్వీకరించడం జరిగిందని బ్రిగేడియర్‌ సరస్వతి వె ల్లడించారు. బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆమె సొంత పట్టణమైన పుంగనూరులో ఆమె చదివిన జెడ్పి బాలికల హైస్కూల్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను విద్యార్థులు, ఉపాధ్యాయులు సన్మానించారు. అనంతరం సరస్వతి తన పీఈటి మాస్టర్‌ కస్తూరి ని సన్మానించారు. అలాగే గురువులను ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు డాక్టర్‌ వేణుగోపాల్‌, సుజన ల ఆశయం మేరకు ఆర్మీలో నర్సుగా చేరి, బ్రిగేడియర్‌ పదవిలో ఉంటు భారతసైనికులకు సేవలందిస్తున్నామన్నారు. తన సేవలను గుర్తించి, అత్యున్నత పురస్కారమైన నైటింగేల్‌ అవార్డును అందజేశారని తెలిపారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్నప్పుడు జాతీయ గీతాన్ని పాఠశాలలో ఆలాపించి, సుమారు యాబై సంవత్సరాల తరువాత తిరిగి అదే పాఠశాలలో జాతీయగీతాలాపన చేయడం సంతోషంగా ఉందన్నారు.
 
 
రూ. 50 వేలు విరాళం…
జెడ్పి పాఠశాల అభివృద్ధికి నైటింగేల్‌ అవార్డు గ్రహిత బ్రిగేడియర్‌ సరస్వతి రూ. 50 వేలు విరాళం చెక్కును హెచ్‌ఎంకు అందజేశారు. తన తండ్రి డాక్టర్‌ వే ణుగోపాల్‌ జ్ఞాపకార్థం అందిస్తున్న నిధులను పాఠశాల అభివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు.

పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Beggar Nightingale Award-Brigadier Saraswati revealed to me by the teachers
 

Natyam ad