శ్రీవారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ ప్రారంభం

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతిలో శ్రీవారి దర్శనానికి ఉచిత టోకెన్ల జారీ మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అలిపిరి భూదేవి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద ఉచిత టోకెన్లను జారీ చేస్తున్నారు.  ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ అయ్యాయి. ఈరోజు టోకెన్ తీసుకున్నవారికి 16 నుంచి దర్శనానికి టీటీడీ  అనుమతించనుంది. ప్రతి గంటకు 1500 మందికి ఉచిత టోకెన్లను టీటీడీ కేటాయిస్తుంది. టికెట్ల కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది నుంచి కూడా వేలాదిగా  శ్రీవారి భక్తులు తరలివచ్చారు.
 
Tags: Begin to issue free tokens for Srivari Darshan

Natyam ad