భాస్క‌ర్‌నాయుడుకు మెరుగైన వైద్య‌స‌హాయం : టిటిడి

కొందరు రాజకీయ నాయకుల ఆరోపణలపై ఖండన
 
తిరుప‌తి ముచ్చట్లు:
 
టిటిడి అట‌వీ విభాగంలో పాములు ప‌ట్టే విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగి  భాస్క‌ర్‌నాయుడుకు మెరుగైన వైద్య స‌హాయం అందించ‌డం జ‌రుగుతోంది. అయితే  భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థితిని టిటిడి పట్టించుకోవడం లేదని తిరుపతికి చెందిన కొందరు రాజకీయ పార్టీల నాయకులు ఆరోపించడాన్ని టిటిడి తీవ్రంగా ఖండిస్తోంది. భాస్క‌ర్‌నాయుడు పాముకాటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురికావ‌డంతో మొద‌ట స్విమ్స్‌లో వైద్యం అందించారు. పాముకాటుతోపాటు ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో మెరుగైన వైద్యం కోసం తిరుప‌తిలోని అమ‌ర ఆసుప‌త్రికి త‌రలించారు.అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశాల మేర‌కు జెఈవో  వీర‌బ్ర‌హ్మం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని తెలుసుకుని వైద్యానికి అవ‌స‌ర‌మైన స‌హాయం అందిస్తున్నారు.  భాస్క‌ర్‌నాయుడు ఆరోగ్య ప‌రిస్థితిని టిటిడి డాక్ట‌ర్లు ఆరా తీస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉండ‌డంతో కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెబుతున్నారు.టిటిడి సిఎంఓ డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌, ఇన్‌చార్జి డిఎఫ్‌వో  ప్ర‌శాంతి, బ‌ర్డ్ ప్ర‌త్యేకాధికారి డాక్ట‌ర్ రెడ్డెప్ప‌రెడ్డి క‌లిసి  భాస్క‌ర్‌నాయుడుకు అందిస్తున్న వైద్య‌సేవ‌ల‌ను స‌మీక్షిస్తున్నారు.
 
Tags; Better medical care for Bhaskar Naidu: TTD

Natyam ad