Bharat Ratna Bajpai's birthday celebrations

భారతరత్న బాజ్‌పాయి జన్మదిన వేడుకలు

Date : 25/12/2017

పుంగనూరు ముచ్చట్లు :

భారతరత్న , మాజీ ప్రధాని బాజ్‌పాయి జన్మదిన వేడుకలను పుంగనూరులో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మైనార్టీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి అయూబ్‌ఖాన్‌, పట్టణ నాయకులు తుంగా క్రిష్ణమూర్తి, గణేష్‌, రాజు, నానబాల కుమార్‌, రాజారెడ్డి, రాజాజెట్టిల ఆధ్వర్యంలో ఇందిరా సర్కిల్‌లో కేక్‌ కట్‌ చేసి , మిఠాయిలు, అన్నదానం చేశారు. ఈ సమావేశంలో అయూబ్‌ఖాన్‌ మాట్లాడుతూ మాజీ ప్రధాని బాజ్‌పాయి పాలనలో దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. అదే బాటలో ప్రధాని మోదీ పాలన సాగిస్తూ , దేశంలో చరిత్ర సృష్టిస్తున్నారని కొనియడారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన అన్ని రాష్ట్రలలోను బిజెపి ప్రభుత్వాలు ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుశీల, గణేష్‌, మణి, బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags : Bharat Ratna Bajpai’s birthday celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *