అసిఫాబాద్ జిల్లా లో ఘనంగా భీమయ్యాక్ జాతర

-పెద్ద సంఖ్య లో తరలి వచ్చిన ఆదివాసీలు
 
ఆసిఫాబాద్ ముచ్చట్లు:
 
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం దంతాలపల్లి గ్రామ సమీపంలో ని దట్టమైన అటవీ ప్రాంతంలో  భీమన్న దేవర ఆలయం లో ఆదివాసీలు  ఘనంగా మహా జాతర నిర్వహించారు  ఆదివాసి తెగకు చెందిన కొలం కుల గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన భీమన్న కుల దేవుని కి ఎంతో ఘనంగా పూజలు నిర్వహించారు తిర్యాని మండలం లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈనెల మూడు రోజుల పాటు ఈ  జాతర ఘనంగా జరిగింది.. గిరిజనుల కొంగ బంగారంగా నమ్ముకొని ప్రతి ఏటా జనవరి మాసంలో చివరి మూడు రోజులపాటు సంప్రదాయబద్ధంగా జాతర నిర్వహిస్తారు ఆదివాసీలు భీమయ్యా దేవుడిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ స్వయంగా వెలిసిన భీమన్న దేవుని ఆలయం చుట్టూ అగ్నిదేవుడు మైసమ్మ పోచమ్మ గ్రామ దేవతలు గా వెలిశాయి..  మూడు రోజులపాటు జరిగిన ఈ జాతరకు మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ దేశ్ రాష్ట్రాల నుండి గిరిజనులు ఈ జాతర లో పాల్గొని పూజలు చేశారు.. అంతేకాకుండా జాతర సందర్భంగా వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్ లను కూడా గిరిజనులు నిర్వహించారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Bhimayyak Jatara is celebrated in Asifabad district

Natyam ad