వివాదంలో భీమ్లా నాయక్.

హైదరాబాద ముచ్చట్లు:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ “భీమ్లానాయక్” మూవీ మహాశివరాత్రి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అయితే తాజాగా భీమ్లానాయక్ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో తమ మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలను చిత్రీకరించారని ఆంధప్రదేశ్ లోని కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎం.పురుషోత్తం తెలిపారు. అంతేకాదు తమ మనోభావాలను కించపరిచేలా చిత్రీకరించిన ఒక సన్నివేశం చిత్రం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు పురుషోత్తం ఫిర్యాదు చేశారు.పవన్ కళ్యాణ్ , రానా మధ్య ఓ ఫైటింగ్ సీన్ లో చిత్రీకరించిన సన్నివేశం కుమ్మరులను కించపరిచేలా ఉందని పురుషోత్తం మీడియాతో చెప్పారు. పవన్, రానా ల మధ్య వచ్చే ఫైటింగ్ సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని కాలితో తన్ని… దానిని తీసుకుని పవన్ పై దాడి చేసినట్లు చూపించారు. అయితే తాము కుమ్మరి చక్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తామని.. దానిని కాలితో తన్నినట్లు చూపించడం తమను కించపరచమే కాదు.. కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసిన విధంగా ఉందని వ్యాఖ్యానించారు. అందుకనే ఈ సన్నివేశం సినిమా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోలేని తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. భీమ్లా నాయక్ హీరోలైన పవన్, రానా, దర్శకుడు సాగర్, నిర్మాత చినబాబు పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.మరోవైపు భీమ్లా నాయక్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై.. సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా దూసుకుపోతుంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
 
Tags:Bhimla Nayak in controversy

Natyam ad