నేటికీ పీడిస్తున్న భోపాల్‌ దారుణం!

హైదరాబాద్‌ ముచ్చట్లు:

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన నేటికీ దేశాన్ని పట్టిపీడిస్తూనే ఉంది. దారుణం జరిగి మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టినా నాటి విషాద ఛాయలు మాత్రం బాధితులనే కాదు… యావత్‌ భారతాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బాధితులకు ఎన్ని కోట్లు పరిహారం అందజేసినా గాలిలో కలిసిన వారి ప్రాణాలను తిరిగి ఇవ్వలేవన్నది ఎంత నిజమో… ఆ దుర్ఘటన తర్వాత కూడా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదన్నది కూడా అంతే వాస్తవం. భోపాల్‌లో ఆ రోజు ఏం జరిగిందన్నది ఒకసారి మననం చేసుకుంటే… ఆరోజు రాత్రి ప్రశాంతంగానే నిద్రలోకి జారుకున్న భోపాల్‌ తెల్లవారేసరికి స్మశానంగా మారిపోయింది. మనందరిలాగే ఎప్పట్లా ఏ మార్పు లేకుండా తెల్లవారుతుందని నమ్మింది. కానీ 1984 డిసెంబర్‌ 2వ తేదీకి, 3వ తేదీకి నట్టనడుమ నిలిచిన ఆ రాత్రి ఒక కరాళ దృశ్యాన్ని ఆవిష్కరిస్తుందన్న నిజం నగరానికి తెలియదు. భోపాల్‌కే కాదు… దేశంలో ఏ ఒక్కరికీ తెలియదు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ రాత్రి అక్కడ కాలం విషాన్ని చిమ్మింది. ‘యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌’ రూపంలో భోపాల్‌ విషవాయు దురంతం చరిత్ర పుటల మీద కాలకూట విషాన్ని పుక్కిళించింది. మూడు వేల మందికి పైచిలుకు మరణించారు. మరో వారంలో మరో ఆరు వేల మంది మరణించారు. ఇక అప్పటి నుండి అక్కడ మరణం శాశ్వత చిరునామాను ఏర్పరచుకుని స్థిరపడి పోయింది. ఫలితంగా లక్షన్నర మంది దీర్ఘకాలిక రుగ్మతలతో క్షణాల్ని లెక్కబెట్టుకుంటూ జీవించడానికి అలవాటు పడిపోయారు. ఆ దారుణాన్ని ఇవాల్టికీ మనకి గుర్తు చేస్తూ పాబ్లో బార్తోమ్యూ, మన దేశపు ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ రఘురాయ్‌తో కలిసి తీసిన ఫొటో మాత్రం మానని గాయంలా సలుపుతూనే ఉంది. విషవాయు ప్రభావానికి గురైన ఒక బాలికను ఖననం చేయబోతుండగా తీసిన ఆ పొటోను మరిచిపోవడానికి మనల్ని కాలం ఏనాటికైనా అనుమతిస్తుందా? అయితేనేం.. దారుణాలకు అలవాటు పడిన వాళ్ళం. 28 ఏళ్ళనాడు నిలువెల్లా వణికిన మనం కూడా పూర్తిగా మరుపు తెరల మాటుకు జారిపోయాం. కాలం మనల్ని అలాగే వదిలివేయదు. ఎన్నిటికీ ప్రాణాల్ని హరించని గుండెపోటు అంటూ ఒకటుంటే అది కాలమే. మళ్ళీ మన గుండెల్లోకి ఒక శరాఘాతాన్ని పాతేసి అది చోద్యం చూస్తోంది. భోపాల్‌ విషవాయు దుర్ఘటనలో 345 టన్నుల అత్యంత ప్రమాదకరమైన వ్యర్థాల్ని గత 28 ఏళ్లుగా ఎక్కడ, ఎలా వదిలించు కోవాలో తెలియక ముంబయిలోని కేంద్ర కాలుష్య నివారణ బోర్డు గింజుకుంటోంది. భోపాల్‌ యూనియన్‌ కార్బట్‌ నుంచి సేకరించిన ఈ వ్యర్థాల్లో విషతుల్యమైన హాలో క్లోరినేటెడ్‌ విషాలు ఉన్నాయి. వాటిని తగులబెడితే ప్రజలు కాలుష్య భ్రావానికి గురె?, కాన్సర్‌, తదితర ప్రమాదకర రుగ్మతల బారిన పడే అవకాశం ఉంది. ఒకేచోట వేల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న ప్రమాదకరమైన రసాయనిక విష వ్యర్థాల్ని ఒకచోటు నుంచి మరోచోటు తరలించి వాటిని నిర్వీర్యం చేయడానికి కేంద్ర కాలుష్య నివారణ యంత్రాంగం మర్మం ఏమిటో అంతుపట్టనిది. 1984 డిసెంబర్‌ మూడవ తేదీ తెల్లవారుజామున… యూనియన్‌ కార్బైడ్‌ పరిశ్రమ నుంచి టన్నుల కొద్దీ లీకైన మిథె?ల్‌ ఐసోసైనేట్‌ (మిక్‌) వేలమంది నిండు ప్రాణాల్ని కబళించింది. ఆదమరచి నిదురుపోతున్న వేళ అశేష ప్రజలపె? విరుచుకుపడ్డ విషభాతం. యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీ ప్లాంట్‌లో 41 టన్నుల విషపూరిత రసాయన వాయువు ఒక స్టోరేజీ ట్యాంక్‌ నుండి లీక్‌ అయింది. లీక్‌ అయిన కొద్ది నిమిషాల్లో నిద్రిస్తున్న భోపాల్‌ నగరమంతటా వ్యాపించింది. మొత్తం మృతుల సంఖ్య 22 వేలకు చేరింది. దాదాపు 5.50 లక్షల మంది ప్రజలు ఆ విషవాయువు ప్రభావానికి లోనయ్యారు. కంటిచూపుపోయినవారు, ఊపిరితిత్తులకు తూట్లు పడ్డవాళ్లు జీవచ్ఛవాలుగా మిగిలినాళ్లెందరో లెక్కే లేదు. నేటికీ అక్కడి గాలిలో, నీటిలో, భూగర్భంలో విషపదార్థ నిక్షేపాలు పుట్టబోయేవారినీ శాపగ్రస్తులు చేస్తున్నాయి. ఆ సంస్థ సారధి అండర్సన్‌ 1984 డిసెంబర్లో పట్టుబడినా, భారత్‌కు తిరిగి వస్తానన్న హామీతో బురిడీ కొట్టించి దేశం దాటి మళ్ళీ ఇటువె?పు తొంగిచూడనే లేదు. అండర్సన్‌ను అప్పగించాల్సిం దిగా ఏడేళ్ళక్రితం భారత్‌ చేసిన అభ్యర్థనను అమెరికా నిష్కర్షగా తోసిపుచ్చింది. ఏళ్ళు గడిచాక ఒక్కో బాధితుడికీ సగటున విదిపింది రూ.12,410లు. సకాలంలో అందించలేని న్యాయం అన్యాయంతో సమానమనేందుకు భోపాల్‌ విషవాయు లీకేజి కేసు ఒక చక్కని ఉదాహరణ. భోపాల్‌ కోర్టు ఏడుగురు జీవించి ఉన్న ముద్దాయిలకు ఒక్కొక్కరికీ 2100 డాలర్ల జరిమానా రెండేళ్ల జె?లు శిక్ష విధించింది. విచారం ఏమిటంటే తమ అప్పీలుపె? తీర్పు వెలువడేంత వరకూ శిక్షలు పొందిన వారికి వెనువెంటనే బెయిల్‌ పొందగలగడం. తొలుత నిందితులపె? శిక్షార్హమైన రహస్య నేరారోపణ చేయగా 1996లో సుప్రీంకోర్టు దానిని నిర్లక్ష్యం వలన మరణంగా నేరారోపణను తగ్గించి వేసింది. గత రెండు దశాబ్ధాలుగా దాదాపు అన్ని రాజకీయపార్టీలు కేంద్రంలో సంకీర్ణ భాగస్వామ్య పార్టీలుగా ఉంటున్నాయి. ఎవరె?నా జరిగినదాన్ని వేలెతె?నా చూపించారా? అనేది సామాన్యుడికీ తెలిసిన సంగతే. మూడవది మీడియా, పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా బాధితలకు అన్యాయం చేశారు. వారికి న్యాయం జరిగే వరకూ సమస్యను అలాగే కేంద్రీకరణలో ఉంచాల్సి ఉంది. నాలుగవది రాజకీయ నాయకులను బాధ్యులను చేయడంలో ప్రజలు కూడా విఫలమయ్యారు. ఇన్నేళ్లుగా భోపాల్‌ విషవాయు దుర్ఘటన ఏనాడు ఎన్నికల సమస్యగా లేదు. ఐదవది, దర్యాప్తు సంస్థలు కూడా విఫలమయ్యాయి. కోర్టులో తన కేసు బలహీనంగా ఉందని, నిందితులకు మెరుగె?న డిఫెన్స్‌ న్యాయవాదులు ఉన్నారని సిబిఐ ఇప్పుడు అంగీకరిస్తోంది. ఆరవది యుపిఎ ప్రభుత్వం అణు ప్రమాదనష్ట పరిహార బిల్లుకు సవరణ గురించి ప్రస్తావిస్తోంది. ఏడవది… లీకేజీ సమయంలో యూనియన్‌ కార్బైడ్‌ చె?ర్మన్‌ వారెన్‌ ఎం.అండర్సన్‌ను ప్రాసిక్యూట్‌ చేయడంలో భారత అధికారులు విఫలమయ్యారు. విపత్తు సంభవించిన తరువాత అండర్సన్‌ భారత్‌కు వచ్చారు. అతనిని కొద్దిసేపు అరెస్టు చేశారు. అయితే బెయిల్‌పె? విడుదల చేశారు. తమ కంపెనీగానీ, ఉద్యోగులు గానీ భారత కోర్టుల పరిధిలోకి రావని ఎందుకంటే ప్లాంటు నిర్వహణతో వారి కెటువంటి ప్రమేయం లేదని, ఈ కంపెనీ యూనియన్‌ కార్బైడ్గ, ఇండియా అధీనంలో ఉంటూ నిర్వహిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రస్తుతం న్యూయార్క్‌లో జీవిస్తున్న అండర్సన్‌ను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయగలదా? ఈ విషవాయువు చూపే దీర్ఘకాలిక ప్రభావం వల్ల నేటీకీ రెండున్నర లక్షల మంది బాధితులు వె?ద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఈ దారుణానికి కారకులె?న వారిని శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందా? నిందులకు శిక్ష పడిందా? విషవాయువు బాధితులకు తగిన విధంగా నష్టపరిహారం ఇచ్చారా? వారి వె?ద్య ఖర్చులు చెల్లించారా? మరోసారి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు, జవాబు దారీతనం కల్పించేందుకు భారత ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకుందా? వీటన్నింటికీ ఒకే సమాధానం లేదు అని మాత్రమే. ఎంత విషాదకరం విషయం. భోపాల్‌ విషవాయు దుర్ఘటనకు సంబంధించి కీలక అంశాలను వికీలీక్స్‌ గతంలోనే విడుదల చేసింది. 50 లక్షలకు పైగా అమెరికా నిఘా సంస్థ ఈ మెయిల్స్‌ను వెబ్‌సైట్‌లో ఉంచిన వికీలీక్స్‌… భోపాల్‌ కార్యకర్తలపై అక్కడి గూడచార సంస్థ ఏ విధంగా నిఘా పెట్టిందన్న విషయాలను కూడా తెలిపింది. కంపెనీ నుంచి విష వాయువు వెలువడే అవకాశాలు ఉన్నాయన్న విషయం తెలిసినా ఆ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి ఎవరూ సహసం చేయలేకపోయారు. వారిని రక్షించడానికి అప్పట్లో పెద్ద యంత్రాంగమే నడిచిందన్న అంశం వెలుగులోకి వచ్చింది. భోపాల్‌ విషవాయు దుర్ఘటనకు సంబంధించిన విషయాలతో పాటు అమెరికన్‌ సంస్థల అవినీతితో కూడిన 50 లక్షల ఈ మెయిల్స్‌ను బయటపెట్టింది. అమెరికన్‌ కంపెనీ డౌ కెమికల్స్‌ను ఎవరెవరు వెనుకుండి రక్షించారన్న దానితో పాటు దుర్ఘటనలో సర్వం కోల్పోయిన వారి కోసం పోరాడుతున్న భోపాల్‌ కార్యకర్తలపై అమెరిగా గూఢచార సంస్థ ఏ విధంగా నిఘా పెట్టిందన్న విషయం వికీలీక్స్‌ బయటపెట్టింది.

భోపాల్‌ విషవాయువు లీకేజీ వల్ల కాదా?

భోపాల్‌ విషవాయువు దుర్ఘటన జరిగి దశాబ్దాలు గడిచిన తర్వాత నమ్మలేని నిజాలు వెలుగుచూస్తున్నాయి. అసలు ఇంత దారుణం జరిగింది విషవాయువు లీకేజీ వల్ల కాదట… అతి ప్రమాదకరమైన క్రిమిసంహారిక మందుల వల్లట. వినడానికి ఇది కొందరికి విడ్డూరంగా అనిపించినా ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు కూడా ధ్రువీకరించిన నిజం. భోపాల్‌ విషవాయువు లీకేజీ ఘటన వల్లే ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా నేల, భూగర్భ జలాలు అన్నీ కలుషితమయ్యాయన్న ప్రజల నమ్మకానికి భిన్నంగా ఆనాటి దుర్ఘటనకు దీనికి ఏమాత్రమూ పొంతనలేదని ప్రభుత్వం ఆ మధ్య ఒక నివేదికలో పేర్కొంది. దాదాపు 15 ఏళ్ళుగా యుసిఐఎల్‌ (యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌) పురుగు మందులను ఉత్పత్తి చేసి వ్యర్ధ పదార్దాలన్నింటినీ తన ప్లాంట్‌ ఆవరణలోనే వేయడంతో ఆ ప్రాంతమంతా కలుషిత మైందని పేర్కొంది. యుసిఐఎల్‌ పురుగు మందులను తయారుచేసేటపుడు వెలువడిన వ్యర్ధ పదార్ధాలను భోపాల్‌లోని తన ప్లాంట్‌ ఆవరణలోనే పడేసిందని, ఇది 1969నుండి 1984వరకు జరిగిందని, దీనివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేల, భూగర్భ జలాలన్నీ కలుషితమై పోయాయని జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్‌ పరిశోధనా సంస్థ (ఎన్‌ఇఇఆర్‌ఐ) తెలిపింది. అంతేకాని దీనికి యూనియన్‌ కార్బైడ్‌ ప్లాంట్‌లో మిథైల్‌ ఐసోసయనైట్‌ గ్యాస్‌ లీకవడానికి ఏ విధమైన సంబంధం లేదని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించింది. ఈ కాలుష్య ప్రాంతాన్ని స్థానికులకు సురక్షితంగా వుండేలా తీర్చిదిద్దడానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టబోయే చర్యలను పర్యవేక్షించడానికి, సమన్వయం చేయడానికి ఏర్పడిన పర్యవేక్షక కమిటీకి అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్‌ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వెంటనే సురక్షితమైన పద్ధతిలో ఆ ప్రాంతాన్ని పూడ్చివేసే చర్యలు చేపట్టాలి. అలాగే పంపింగ్‌ అండ్‌ ట్రీట్‌ వ్యవస్థను కూడా సుదీర్ఘ కాలం చేపట్టాలని ఆ అధ్యయనం పేర్కొంది. పూడ్చడానికి 78 నుండి 117 కోట్ల వరకు ఖర్చవుతుందని, పంపింగ్‌ వ్యవస్థకు 25 నుండి 30 లక్షలు ఖర్చుకాగలదని ఆ నివేదిక పేర్కొంది. ప్లాంట్‌ ఆవరణకు, సోలార్‌ ఎవాపరేషన్‌ పాండ్‌(ఎస్‌ఇపి)లకు సరిగ్గా ఫెన్సింగ్‌ వేసి భద్రత కల్పించాలి. అనధికారికంగా ఎవరూ అక్కడకు వెళ్ళ కుండా, ప్రజలెవరూ దాన్ని ఉపయోగించకుండా చూడాలని కోరింది. కాలుష్యమైన ఐదు బావులను తక్షణమే మూసివేయాలని సిఫార్సు చేసింది. ఈ బావుల్లో నీరును ఏ అవసరాల నిమిత్తం ప్రజలు ఉపయోగించకుండా చూడాలని కోరింది. ఇలా ప్రభుత్వానికి సమర్పించిన ఆ నివేదికలో కొన్ని సిఫార్సులు, సూచనలు చేసింది. ఎన్‌ఇఇఆర్‌ఐతో పాటు జాతీయ భూగోళిక పరిశోధనా సంస్థ(ఎన్‌జిఆర్‌ఐ) కూడా సర్వే నిర్వహించింది. యుసిఐఎల్‌ ఆవరణలోనే వివిధ ఉత్పత్తుల తయారీ కర్మాగారాలు, యంత్రాలు, భవనాలు, షెడ్డుల అవశేషాలను పరిశోధనా బృందం తన సర్వేలో కనుగొంది. వీటిల్లో చాలా వరకు కాలుష్యం బారినపడినట్లే కనిపిస్తోందన్నారు. 1984లో ప్లాంట్‌ను మూసివేసినప్పటికీ గత 25 ఏళ్ళ కాలంలో ఎలాంటి పరిష్కార చర్యలు చేపట్టలేదు. గత ఏడాదే అధ్యయనం నిర్వహించాల్సిందిగా భోపాల్‌ విషవాయువు దుర్ఘటన సహాయ, పునరావాస విభాగం ఎన్‌ఇఇఆర్‌ఐ, ఎన్‌జిఆర్‌ఐలను కోరింది. భోపాల్‌ విషవాయువు దుర్ఘటన విషాదం ఆ నగరానిదే కాదు, దేశమంతటిదీ. మృతులను లెక్కించకుండానే గుట్టలుగా పోసి తగులబెట్టారు. విషవాయువు భోపాల్‌ సరస్సును దాటి ఆవల వున్న శ్యామలా హిల్స్‌ కాలనీలోని సంపన్న వర్గాల ఇళ్లవైపు వెళ్లలేదు. యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసించే పేదలపైనే ప్రతాపం చూపింది. పేవ్‌మెంట్ల మీద నిద్రపోతున్న నిరాశ్రయులను కాటేసింది. పేదల మరణాలు అంత ప్రాముఖ్యత లేనివి. కాబట్టి శవాల లెక్కలు మెల్లగా మొదలయ్యాయి. లెక్కించకుండా తగులబెడితే మాత్రం పట్టించుకునే నాథుడెవరు? యూనియన్‌ కార్బైడ్‌ను రక్షించే యత్నాలు ముమ్మరంగా నడిచాయి. రాజకీయ నాయకులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. బాధితుల తరపున తనే ఏకైక వకాల్తాదారునని ప్రభుత్వం చెప్పింది. అందుకోసం ఏకంగా ఒక శాసనాన్ని తెచ్చింది. నష్టపరిహారం గురించి బాధితుల తరపున మాట్లాడి ఒప్పందం కుదుర్చుకునే అధికారం ప్రభుత్వానికి దఖలు పడింది. వేరెవరూ మాట్లాడేందుకు వీలులేదు. బాధిత ప్రజలకు తల్లీ తండ్రీ తనే అని చెప్పింది. కానీ పాలక ప్రభువులు తల్లితండ్రులు లాగ వ్యవహరించలేదు. ఏ తల్లీ తండ్రీ తమ బిడ్డలతో వ్యవహరించనంత నిర్దయగా, దుర్మార్గంగా కుట్రపూరితంగా వ్యవహరించారు. యూనియన్‌ కార్బైడ్‌ను మాత్రం సొంత బిడ్డగా భావించారు. రక్షించారు. భోపాల్‌ దుర్ఘటనలో నిందితులైన భారతీయులకు భారత శిక్షాస్మృతిలోని 304-ఎ సెక్షన్‌ కింద రెండేళ్లు మాత్రం శిక్ష వేశారు. కారో, బస్సో నిర్లక్ష్యంగా నదిపి చేసే ప్రమాదంతో భోపాల్‌ దుర్ఘటనను సమానం చేశారు. సుప్రీంకోర్టే ఈ పని చేసింది. సిబిఐ 304 అనే పెద్ద సెక్షన్‌ పెడితే దాన్ని అత్యున్నత న్యాయస్థానం చిన్నదిగా చేసింది. న్యాయవ్యవస్థకు ఎప్పుడూ ఉన్న వాళ్ల పట్లే సానుభూతి. దీనికి ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అహ్మది మినహాయింపు కాదు. భోపాల్‌ బాధితులు నిష్ట దరిద్రులు. సుప్రీంకోర్టు సమీపంలోని రిజర్వు బ్యాంకులో అప్పటి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఖాతాలో పదిన వందలాది కోట్ల డాలర్ల వాసననెరుగని అమాయకులు. వారికి న్యాయం జరిగేదెక్కడ? భోపాల్‌ పాపంలో అప్పటినుంచీ ఇప్పటివరకూ పాలించిన పాలకులందరికీ భాగస్వామ్యం ఉంది. అప్పటి దుర్ఘటనకు ప్రధాన బాధ్యుడు ఆందర్సన్‌ను దేశం దాటించడంలో, తిరిగి భారత్‌కు రప్పించలేకపోవడంలో అన్ని పార్లమెంటరీ పార్టీలకూ పాత్ర ఉంది. ఇక భోపాల్‌ విషవాయువు బాధితుల కడగండ్లకు షాజిదా బానో ఖాన్‌ విషాద గాథే సాక్ష్యం. యూనియన్‌ కార్బయిడ్‌ (యుసిఐఎల్‌)లో ఉద్యోగిగా ఉన్న ఆమె భర్త అషఫ్‌ ఖాన్‌ 1981లో కంపెనీలో ఫోస్‌జీన్‌ గ్యాస్‌ లీక్‌ వల్ల మరణించారు. మూడేళ్ళ తరువాత యూనియన్‌ కార్బయిడ్‌ కంపెనీలో గ్యాస్‌ లీకయిన సమయంలో ఆమె తన కుమారులతో కలసి భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో రైలు దిగారు. విషవాయువు ప్రభావం వల్ల ఆమె పెద్ద కుమారుడు మరణించాడు. చిన్న కుమారుడు తీవ్రమైన గాయాలకు గురై జీవచ్చవంలా మిగిలాడు. ఇలాంటి వారు ఎందరో? మొదట 2,500 మంది మరణించారనే అధికార ప్రకటనలో మొదలై ఇప్పుడు మృతుల సంఖ్య 20 వేలు దాటిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, తదనంతర పరిణామాలు, బాధితులకు జరిగిన అన్యాయం. వెరసి అబద్ధాల దొంతర… గ్యాస్‌ లీక్‌ అర్థరాత్రి జరిగింది. 36 వార్డులకు చెందిన జనాభాలో అత్యధికులు ఇళ్ళవద్దనే ఉన్నారు. వారి వారి సంపాదన శక్తి ఆధారంగా భోపాల్‌ వాసులు కచ్చా ఇళ్ళు, పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. యూనియన్‌ కార్బయిడ్‌ ప్లాంట్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ కాగానే కంపెనీ చుట్టుపక్కల మట్టితో, తడికలతో నిర్మించిన ఇళ్ళలోకి గాఢంగా ఉన్న విషవాయువు ఎలాంటి అడ్డూ ఆపూ లేకుండా ప్రవేశించింది. దాంతో ఆ ఇళ్ళలో నివాసముంటున్న వారు నిద్రలోనే మూకుమ్మడిగా మరణించారు. యూనియన్‌ కార్బయిడ్‌ ప్లాంట్‌ నగరానికి ఉత్తరం దిశలో ఉంది. అక్కడి నుంచి గాలి వాటంగా విషవాయువులు దక్షిణం వైపు వీచి విషవాయువు మేఘంగా మారాయి. విషవాయువులను పీల్చడం వల్ల పక్కా ఇళ్ళలోని వారు ఉన్నట్టుండి దిగ్గున లేచి కూర్చున్నారు. విషవాయువులను పీల్చడం వల్ల అయోమయానికి, ఆదుర్ధాకు గురైన వారు ఇళ్ళ నుంచి బయటికి వచ్చి గాలి పయనిస్తున్న దక్షిణంవైపు పరుగులు తీశారు. కంపెనీ సమీప ప్రాంతాల నుంచి జనం పరుగులు తీస్తుండటంతో వీధుల్లో గందరగోళం మొదలైంది. అది చూసి పక్కా ఇళ్ళవారు కూడా దక్షిణం వైపు పరుగులు తీశారు. దీనివల్ల విషవాయువు నుంచి దూరంగా వెళ్ళాలని పరుగులు తీస్తున్నవారు ఎక్కువ వాయువు పీల్చారు. ఎలాంటి హడావుడి చేయకుండా, కంగారు పడకుండా పక్కా ఇళ్ళలో ఉండిపోయిన వారిపై విషవాయువు ప్రభావం నామమాత్రంగా ఉంది. ఎందుకంటే డిసెంబర్‌ నెలలో చలి తీవ్రంగా ఉండటం వల్ల ఆ ఇళ్ళ తలుపులు, కిటికీలు గట్టిగా బిగించి ఉండటంతో విషవాయువు అంత తొందరగా జొరబడలేదు. సైకిళ్లు, టాంగాలు, మూడు చక్రాల వాహనాలు, లారీలు, మినీ బస్సులు, కార్ల వంటి వాహనాలు ఉన్నవారు ప్లాంట్‌కు దూరంగా వెళ్ళారు. గ్యాస్‌ లీకేజీని అదుపు చేసేంత వరకు దాదాపు రెండు గంటల పాటు జనం పీల్చింది విషవాయువులనే. భోపాల్‌లో మొత్తం 56 వార్డులున్నాయి. వాటిలో 36 వార్డుల్లోని ప్రజలపై మిథైల్‌ ఐసో సైనేట్‌ విషవాయువు ప్రభావం పడింది. మొత్తం జనాభా తొమ్మిది లక్షల మందిలో దాదాపు ఆరులక్షల మందికి విషవాయువు ప్రభావానికి లోనయ్యారు. గ్యాస్‌ ప్రభావిత ప్రాంతంలో మొక్కలు, పశు పక్ష్యాదులు నాశనమయ్యాయి. ఆ రోజుల్లో భోపాల్‌లో ఉన్న పెద్ద ఆసుపత్రి హమీదియా హాస్పిటల్‌. అది కార్బయిడ్‌ ప్లాంట్‌కు పశ్చిమాన మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కళ్ళలో, ముక్కులలో మంటలు, ఆపుకోలేనంత దగ్గు, కంట నీరు రావడంతో గ్యాస్‌ బాధితులలో చాలా మంది హమీదియా హాస్పిటల్‌కు పరుగులు తీశారు. మిథైల్‌ ఐసో సైనేట్‌కు విరుగుడు ఏమిటో కంపెనీ వెల్లడించని కారణంగా డాక్టర్లు, మెడికోలు, నర్సులు రేయింబవళ్లు గ్యాస్‌ బాధితులకు తాము చేయగలిగినంత సహాయం అందించారు. ఆ తరువాత సైనేడ్‌కు విరుగుడుగా సోడియం థయోసల్ఫేట్‌ వాడినట్లయితే బాగా పని చేస్తుందని కొందరు డాక్టర్లు సూచించారు. బాధితులకు సోడియం థయోసల్ఫేట్‌ సూది మందు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కాగానే యూనియన్‌ కార్బయిడ్‌ అనుకూల లాబీ ఆ మందు వాడవద్దని ప్రచారం ప్రారంభించింది. వారిఒత్తడికి ప్రభుత్వం తలొగ్గింది. మిథైల్‌ ఐసో సైనేట్‌ వాయువు పీల్చడం వల్ల సైనేడ్‌ ప్రభావం పడిందనే వాదన తప్పని ఋజువు చేయడంలో కార్బయిడ్‌ కంపెనీ విజయవంతమైంది. అప్పుడు సకాలంలో సోడియం థయోసల్ఫేట్‌ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల చాలా మంది బతికేవారని, క్షతగాత్రుల సంఖ్య తగ్గేదని ఇరవై ఏళ్ళ తరువాత భారత వైద్య పరిశోధనా మండలి ఒప్పుకుంది. మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. దాదాపు లక్ష కుటుంబాలకు ఉచితంగా రేషన్‌ సరఫరా చేయడం ప్రారంభించింది. అయితే ఉచిత రేషన్‌ సరఫరా, దుర్ఘటన జరిగిన ఏడాదికి నిలిపివేశారు. 1986 నుంచి 1990 వరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందిన సహాయం ఏమీలేదు. చాలామందికి 1989 ఫిబ్రవరి 14-15 తేదీలలో కుదిరిన భోపాల్‌ ఒప్పందం వల్ల కూడా ప్రయోజనం కలుగలేదు. ఈ ఒప్పందం ఉద్దేశం గ్యాస్‌ దుర్ఘటన బాధితులకు తక్షణ సహాయం అందించడం. నష్టపరిహారం కోసం దాఖలైన క్లెయిములను పరిష్కరించకపోవడం, దుర్ఘటన బాధిత కుటుంబాలను, లబ్ధిదారులను గుర్తించడంలో జాప్యం వల్ల చాలా మంది నిస్సహాయులుగా మిగిలారు. కేంద్రంలో విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ నేతృత్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడే వరకు ఎలాంటి సహాయం అందలేదు. పి.పి.సింగ్‌ అధికారం చేపట్టాక 36 గ్యాస్‌ ప్రభావిత వార్డులకు చెందిన వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.200 చొప్పున తాత్కాలిక సహాయం ఇవ్వడం మొదలెట్టారు. ఈ నిర్ణయం వల్ల ఐదులక్షలకు పైగా బాధితులు ప్రయోజనం చేకూరింది. ఈ తాత్కాలిక సహాయం ఆరేళ్ళకు పైగా 1996 వరకు కొనసాగింది. దుర్ఘటన తీవ్రతను అంచనా వేసిన తీరు దారుణంగా ఉంది. మొత్తం 5,97,908 క్లెయిములు దాఖలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటిలో కొన్నింటినే పరిష్కరించింది. కేంద్ర ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించింది. గ్యాస్‌ ప్రభావితులు కేవలం 1,05,000 మంది ఉంటారని, వారిలో మూడు వేల మంది మరణించారని కేంద్రం కోర్టులో నమ్మబలికింది. మరోవైపు, కేంద్ర నేర పరిశోధన శాఖ (సిబిఐ) 1987 డిసెంబర్‌ 1వ తేదీన భోపాల్‌ చీఫ్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో విషవాయు దుర్ఘటన బాధితుల సంఖ్య ఐదు లక్షలకు పైగా ఉంటుందని తెలిపింది. ఆ తరువాత క్లెయిమ్‌ కోర్టులు గ్యాస్‌ ప్రభావితుల సంఖ్యను 5,74,367 అని తేల్చాయి. 1989లో విదేశీయ మారకం ధరల ప్రకారం 1,05,000 మంది బాధితుల కోసం నిర్ణయించిన పరిహారం రూ.713 కోట్లు. కానీ కోర్టులు నిర్ధారించిన విధంగా బాధితుల సంఖ్యకు అనుగుణంగా నష్టపరిహారాన్ని పెంచలేదు. రూ.713కోట్ల పరిహారాన్నే 5,74,367 మందికి పంచారు. అంటే మామూలుగా ఒప్పందం ప్రకారం రావలసిన పరిహారంలో ఐదవ వంతుకన్నా తక్కువ బాధితులకు, మృతుల కుటుంబాలకు ముట్టింది. విషవాయువు పీల్చడం వల్ల దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందనేది అంచనా వేయడంలో విఫలమైనందుకు ప్రభుత్వాన్ని, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్‌) అధికారులను మందలించాలి. మిథైల్‌ ఐసో సైనేట్‌ గ్యాస్‌ పీల్చడం వల్ల అవయవాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని తేలింది. అయినప్పటికీ బాధితులపై గ్యాస్‌ ప్రభావాన్ని అంచనా వేయడానికి 1985లో ప్రారంభించిన 20 పై చిలుకు ప్రాజెక్టులను 1994లో ఐసిఎంఆర్‌ నిలిపివేసింది. భోపాల్‌ గ్యాస్‌ బాధితులకు సోడియం థయో సల్ఫేట్‌ ఇంజక్షన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన లాబీలోని వారిపై వైద్యపరమైన నిర్లక్ష్యానికి గాను ఎన్నడైనా కేసులు పెట్టే అవకాశం ఉందా?

Tag : Bhopal worried today


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *