Bilingual Movie

బైలింగువల్ మూవీ

Date:17/09/2018
ధనుష్ డైరక్షన్ లో నాగార్జున
హైద్రాబాద్, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్)
ప్రస్తుతం దేవదాస్ చిత్రంలో నటిస్తున్న నాగార్జున తెలుగు తమిళంలో బైలింగువల్ మూవీ లో నటించబోతున్నాడు. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చెయ్యబోయే చిత్రంలో నాగార్జున ధనుష్ తో పాటుగా ఆ సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే పూజ కార్యక్రమాలతో మొదలైన ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేసుకుంది.
తమిళంలో స్టార్ హీరో, తెలుగులో ఒక మాదిరి హీరోగా ఉన్న ధనుష్ కి అటు డైరెక్షన్ లోను, ఇటు నిర్మాణంలోనూ మంచిది నుభవమే ఉంది. అయితే మొదటి సినిమాతో డైరెక్టర్ గా హిట్ కొట్టిన ధనుష్ తన రెండో సినిమాని తానే ఒక హీరోగా… నాగార్జున మరో హీరోగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అను ఇమ్మాన్యువల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే అను నాగార్జున కి జంటగానా.. లేదంటే ధనుష్ కి జోడిగానా అనేది తెలియాల్సి ఉంది.
ఇక రెగ్యులర్ షూట్ లో భాగంగా మొదటి షెడ్యూల్ ని మధురైలో మొదలెట్టేసాడు. ఈ షెడ్యూల్ లో కొన్ని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తదుపరి షెడ్యూల్లో నాగార్జున జాయిన్ కానున్నారట. అయితే ధనుష్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో మొదట్లో నాగార్జున హీరో కాదంట. ఆ సినిమాలో ఆ రోల్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ కోసమే రాసుకున్నాడట.
ఇక రజినీకాంత్ కూడా ముందు ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నప్పటికీ… తర్వాత రాజకీయాలు.. ఇతర ప్రాజెక్టులతో బిజీ అవడంతో.. ఈ సినిమా లో నటించడం కుదరకపోయేసరికి ఆ ప్లేస్ లోని నాగార్జున వచ్చి చేరాడట. తర్వాత నాగ్ కి ధనుష్ కథ వినిపించడం కథ నచ్చిన నాగ్ ఈ సినిమాకి ఓకె చెప్పడం జరిగిపోయాయట.ఈ విషయాన్నీ హీరో కమ్ డైరెక్టర్ కమ్ నిర్మాత అయిన ధనుష్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
ఇక హీరోగా ఈ సినిమా ని డైరెక్ట్ చేస్తున్న ధనుష్ ఈ సినిమాలో సూపర్ స్టార్ ప్లేస్ లో నాగార్జున నటించడంతో తెలుగులో మంచి మార్కెట్ ఉంటుందని చెబుతున్నాడు. అంతేలే హీరో కం డైరెక్టర్ గా ధనుష్ కి ఈ సినిమా కి కోలీవుడ్ లో క్రేజొస్తే… నాగార్జున నటించినందుకు తెలుగులోనూ బోలెడంత ఫెమ్ వస్తుంది.
సో అలా రెండు భాషల్లోనూ ఈసినిమా పై అంచనాలు మొదలవుతాయి. మరి ధనుష్ ప్లాన్ చాలా బావుంది. అయితే సూపర్ స్టార్ రజిని చేయనందుకు ఈ కథ నాగ్ కి వినిపించిన తర్వాతె ధనుష్ తెలుగు, తమిళంలో ఒకేసారి ఈసినిమా చెయ్యడానికి ప్లాన్ చేసి ఉండొచ్చనేది ఇప్పుడు కొందరి భావన.
Tags:Bilingual Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *