మధ్యాహ్నానికే ముగించిన జన్మభూమి కార్యక్రమం:

-రాజకీయ నాయకులతో మమ అనిపించిన వైనం:
-అరకొర అదికార్లతో కానిన్చారు:

వి.కోట ముచ్చట్లు:

మేము అడిగిన సమస్యలకు సమాదానం చెప్పండి…….మాగ్రామ రహదారి బాగు చేయండని ఏళ్లుగా మొత్తుకున్నా పట్టించుకోలేదు….సమస్యల పరిష్కారమే జన్మభూమి కార్యక్రమం అన్నారుగా…..దీని సంగతి తేల్చిన తరువాతే మొదలెట్టాలని లేకుంటే జరుపోద్దోని.పేద్దభరనిపల్లి గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన చోటు చేసుకుంది…….ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…ఏళ్ళ తరబడి తమ గ్రామానికి వెళ్ళే మార్గాన్ని బాగు చేయించండి అంటూ అదికారులు,నాయకుల చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని,ప్రతిపాదనలు పంపాం చూస్తాం చేస్తాం అంటూ కాలం గడుపుతున్నారు తప్ప బాగుచేయించలేదని,దీని మూలంగా ప్రయాణం చేయుటకు అవస్థలు పడుతున్నామని సభ ద్రుష్టికి తీసుకొచ్చారు.అదికార పార్టీ నాయకులు కలగజేసుకోని అర్జీ ఇవ్వమని ఉచిత సలహా ఇచ్చారు.దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు సమావేశంలో అధికార్లు పాల్గొనాలి..నాయకులు మీరు ఎవరు చెప్పడానికి అని ఘాటుగా చెప్పి నాయకుల నోటికి తాళం వేశారు.అధికారపార్టీ నాయకులు బిస్లేరి నీళ్ళు తాగాలి!ప్రజలకు కలుషిత నీరు తాగాలా!రెండు రూపాయలకే పరిశుద్ద నీటి మాటలు ఎక్కడ నేరవేర్చారని ప్రశ్నించారు.రేస్కో డైరెక్టర్ మాట్లాడుతూ..రైతులకు పగటిపూట నిరంతరంగా ఏడు గంటలు విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.ఎక్కడ ఇస్తున్నారని ఆధారాలు చూపాలని వారు నిలదీశారు.రైతు రథం పధకం ద్వారా ఎంత రైతులు దరఖాస్తు చేసుకున్నారు.అర్హులైన రైతులకు రథాలు ఇవ్వకుండా కార్యకర్తలకే ఇచ్చారని,పంట కుంటలు ఎన్ని తవ్వారు,వాటిలో ఎన్ని నీళ్ళు నిల్వచేసి భూగర్భ జలాలు పేన్పుకు క్రుశి చేసారో లెక్క తేల్చాలని పట్టుపట్టారు.రహదారి వెంబడి ఉపాధి హామీ పధకం ద్వారా పెంచిన మొక్కలు ఎన్ని వ్రూక్శలు అయ్యాయో,వాటి సంరక్షణకు కేటాయించిన నిదులు అడిగారు.వానలు లేదని ఎండిపోయాయని నాయకులు సమాదానం ఇచ్చారు.మూడు సంవత్సరాలు నీళ్ళు పోసి కాపాడినట్టు లెక్కలు చూపి కాజేసిన సొమ్ము ఎవరి ఖాతాలో చేరిందో చెప్పాలని నినదించారు.హన్ద్రీ నీవా కాలువ నిర్మాణంతో గ్రామంలో చెరువు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని,అలైన్ మెంట్ మార్చమని విన్నవిన్చిన పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి ప్రగల్భాలు పలికితే మోసపోవడానికి తాము సిద్దంగా లేమని హెచ్చరించారు.ప్రజలు అడిగిన ప్రతి సమస్యకు రాజకీయ,అదికారపార్టీ నాయకులు డొంక తిరుగుడు సమాదానం ఇచ్చారు.దీంతో మీ మభ్యపెట్టే మాటలు కట్టిపెట్టండని తీవ్రంగా మందలించారు.దీంతో కోపోద్రేకం చెందిన నాయకులు మీరు కోర్టుకు వెళ్ళి అభివృద్ది చేసుకోవాలని వూగిపోయారు.నిజాలు అడిగితే కోర్టులకు వెళ్ళమంటారు,దీన్ని చెప్పడానికి సమావేశం ఎందుకని ద్వజమేత్తారు.ఒక్క సమస్యకి సమాదానం ఇవ్వకుండానే వెనుతిరిగారు.ఇలా అర్ధంతరంగా సమావేశం ముగించుకుని పురమాయించారు….మద్యాహ్నంకే మమ అనిపించారు.పింఛన్లు,రేషన్ కార్డులు ఇస్తారని ఎదురుచూసిన వారు ఉసురు మని వెనుదిరిగారు.

Tags : Birthday program to end at noon:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *