Birthplace of festivals

 పండుగలను తలపిస్తున్న జన్మభూమి

– మా ఊరు కార్యక్రమం. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలన్న మంత్రి అమర్

పలమనేరు ముచ్చట్లు:

నవ్యాంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 5 వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపిస్తుందని పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు. వి.కోట మండల పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కాగా జవునిపల్లె గ్రామంలో జరిగిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, రెండవ జెసీ చంద్రమౌళి, మదనపల్లె సబ్ కలెక్టర్ వెట్రిసెల్వి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమరనాథ్ రెడ్డి గ్రామసభలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రతిఙ చేయించి ప్రసంగించారు. మంత్రి అమర్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక రూ. 16 వేల కోట్లు ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనాదక్షతతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, 46 లక్షల పింఛనులు, మహిళల ఆర్థిక వెసులుబాటుకు పసుపు కుంకుమ పథకం ద్వారా రూ. 10 వేలు, జిల్లా వ్యాప్తంగా రూ. 95 కోట్లతో వడ్డీ లేని రుణాలు,బాలికలకు సైకిల్స్ పంపిణీ, 7 గంటల కరెంటు, మహిళల ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామనజ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో రూ. 122 కోట్లతో పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా 240 కి.మీల అప్రోచ్డ్ రోడ్లను వేయడానికి ప్యాకేజీని మంజూరు చేయించామని వివరించారు. అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ చౌడేశ్వరికి ఆయన సూచించారు. అనంతరం లబ్ధిదారులకు చంద్రన్న సంక్రాంతి కానుకలు, భీమా,రుణుపశమణ పత్రాలు,కొత్త రేషన్ కార్డులు, రైతు రథాలను, సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు మంత్రి అమర్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Tags: Birthplace of festivals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *