పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు

పుంగనూరు ముచ్చట్లు:
 
భారత గణతంత్ర దినోత్సవం నాడు పుంగనూరులో విచ్చలవిడిగా మాంసం విక్రయాలు కొనసాగాయి. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా బిరియాని విక్రయాలు జరగడం హాస్యాస్పదం. ప్రతి యేటా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు మాంసం విక్రయాలు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం శాశ్వత ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ మున్సిపల్‌ అధికారులు తూతూమంత్రంగా మాంసం విక్రయాలు నిషేధించినట్లు ప్రకటనలు జారీ చేశారు. కానీ మాంసం విక్రయాలు యధావిధిగా కొనసాగడంతో గణతంత్ర దినోత్సవానికి పుంగనూరులో విలువలేకుండ పోయింది. పట్టణంలోని కొత్తపేట, ఎంబిటి రోడ్డు, ఎన్‌.ఎస్‌.పేటలో విక్రయాలు జరిగాయి. కనీసం మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ కూడ లేకపోవడం నవ్వులపాలైంది. దీనిపై జిల్లా కలెక్టర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

దాడులను అరికట్టాలి
Tags: Biryani sales on Republic Day in Punganur

Natyam ad