Chhattisgarh Kamalanidena ... Mizoram is the hand of the Kathanti

ప్ర‌భుత్వ నియంతృత్వ  విధానాల‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తాం బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్ 

Date:19/06/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
నాలుగేళ్ల కాలంలో అవినీతి ర‌హిత‌, పార‌ద‌ర్శ‌క పాల‌న‌తో ప్రధాన న‌రేంద్ర‌మోదీ ప్ర‌జారంజ‌క పాల‌న కొన‌సాగిస్తున్నారని, పేద‌రిక నిర్మూళ‌న కోసం  మోదీ ప్ర‌భుత్వం తీవ్ర స్థాయిలో కృషి చేస్తుంద‌ని బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్ అన్నారు. ప్ర‌ధాని తీసుకున్న ప్ర‌జాసంక్షేమ చ‌ర్య‌లు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలతో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేరు ఇవాళ విశ్వ‌వ్యాప్తంగా వినిపిస్తుంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ గ‌ల నాయ‌కుడిగా మోదీ వెలుగొందుతు న్నార‌న్నారు. బిజెపి మ‌హిళామోర్చా అధ్యక్షురాలు ఆకుల విజ‌య అధ్య‌క్ష‌త‌న‌ నిర్వ‌హించిన బిజెపి మ‌హిళామోర్చా రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.  రాష్ట్ర, జిల్లా, మండ‌ల స్థాయిల‌తో పాటు శ‌క్తి కేంద్రాలు, బూత్ కేంద్రాల వ‌ర‌కు విస్త‌రించిన పార్టీ బిజెపి అని, మిగ‌తా పార్టీల్లో లేన‌టువంటి క్ర‌మ‌శిక్ష‌ణ‌, నాయ‌క‌త్వ విధానం బిజెపిలో ఉంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు.గ‌తంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హ‌యాంలో రోజుకో కుంభ‌కోణం.. నెల‌కో స్కాం అన్న‌ట్లు అనేక అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని, కుటుంబ పాల‌న, వార‌సత్వ పాల‌న‌తో కాంగ్రెస్ ఈ దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించింద‌న్నారు.కేంద్రంలో న‌రేంద్ర‌మోదీ పాల‌న‌, రాష్ట్రంలో కేసీఆర్ పాల‌నకు ఎక్క‌డ పొంత‌నా లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌న కొన‌సాగుతుంద‌ని, నాలుగేళ్ల టీఆర్ఎస్ పాల‌న‌లో ఆ పార్టీ ప్ర‌జ‌లికిచ్చిన ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌లేద‌న్నారు. కేసీఆర్ మాట‌లు కోట‌లు దాటుతున్నాయ‌ని, చేత‌లు మాత్రం ప్ర‌గ‌తిభ‌వ‌న్ కూడా దాట‌డం లేద‌న్నారు. స‌చివాల‌యానికి రాకుండా పాల‌న చేస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు.ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను విస్మ‌రించి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుంద‌న్నారు.ఎన్నిక‌లు స‌మీపిస్తుందునే ఇవాళ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రైతు బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తుంద‌ని, అందులోనూ అనేక లోపాలున్నాయ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు.  టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు పూర్తియినా.. ఇప్ప‌టివ‌ర‌కు నిరుద్యోగ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేద‌ని, ల‌క్ష‌ల ఉద్యోగ ఖాళీలుంటే వాటిని భ‌ర్తీ చేయ‌కుండా సీఎం కేసీఆర్ నిరుద్యోగుల జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్నార‌న్నారు. మ‌న రాష్ట్రం మ‌న‌కొస్తే మ‌న జీవితాలు బాగుప‌డ‌తాయ‌ని యువ‌త ఉద్య‌మంలో పాల్గొన్నార‌ని, ఏళ్ల త‌ర‌బ‌డిగా ఉద్యోగాల కోసం క‌ళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూపులు చూస్తున్నార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.టీఆర్ఎస్ స‌ర్కార్‌ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల‌పై పెడుతున్న దృష్టి… ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పెట్ట‌డం లేద‌న్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌.. ఇవాళ ఊరికో ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌ని, కేసీఆర్ ఇంట్లో మాత్రం నాలుగురికి రాజ‌కీయ ప‌ద‌వులు వ‌చ్చాయ‌న్నారు. పేద‌ల‌కు రెండు ప‌డ‌క గదుల ఇళ్లు ఇస్తామ‌న్న కేసీఆర్.. ఎక్క‌డో ఒక‌టి అరా క‌ట్టించి, అందిరికీ ఇళ్లిచ్చామ‌న్న‌ట్లు చెప్పుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. అలాగే ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి పంపిణీ ఏనాడో అట‌కెక్కిందని, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఊసే లేద‌ని ఆయ‌న అన్నారు.ప్ర‌జా సమ‌స్య‌ల ప‌రిష్కారంలో ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్రంగా విఫ‌ల‌మైంద‌ని, పేద‌ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మార్పు అవ‌స‌ర‌మ‌ని, ఆ మార్పు కేవ‌లం బిజెపితోనే సాధ్‌‌మ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ స్ప‌ష్టం చేశారు.స‌బ్ కా సాథ్- స‌బ్ కా వికాస్ నినాదంతో .. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, వెనుక‌బ‌డ్డ వ‌ర్గాల ప్ర‌జ‌లు, పేద‌ల అభివృద్ధికి మోదీ ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తుంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ స్ప‌ష్టం చేశారు.70 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తంలో 60 శాతం ప్ర‌జ‌ల‌కు క‌నీసం మ‌రుగుదొడ్లు కూడా లేవ‌ని, 2014లో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఎర్ర‌కోట నుంచి మ‌రుగుదొడ్ల గురించి మాట్లాడిన మొద‌టి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు.మోదీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తి ఇంటికి మ‌రుగుదొడ్డి నిర్మించుకునేందుకు 12 వేల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ప్ర‌భుత్వం మోదీ ప్ర‌భుత్వ‌మ‌ని, ప్ర‌తి ఇంటికి మ‌రుగుదొడ్డి నిర్మించి ఇచ్చి వాటికి మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వ ఆల‌యాలుగా పేరు పెట్టిన ఘ‌న‌త మోదీకి ద‌క్కుతుంద‌ని, దేశ‌వ్యాప్తంగా నాలుగేళ్లలో మోదీ ప్ర‌భుత్వం 7 కోట్ల 50 ల‌క్షల మురుగుదొడ్లు నిర్మించి ఇచ్చింద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ తెలిపారు. పేద‌రికం నుంచి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేద‌ల క‌ష్టాలు తెలిసిన వ్య‌క్తిగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ క‌ష్టాల‌ను రూప‌మాపేలా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని,  వంటింట్లో క‌ట్టెల పొయ్యితో వంట‌చేస్తూ తీవ్ర క‌ష్టాలు ప‌డే పేద మ‌హిళ‌ల‌కు మోదీ ప్ర‌భుత్వం ఉజ్వ‌ల ప‌థ‌కంలో భాగంగా ఉచితంగా గ్యాస్ క‌నెక్ష‌న్లు ఇస్తుంద‌ని, ఇప్ప‌టికే దేశంలో 8 కోట్ల ఉచిత గ్యాస్ క‌నెక్ష‌న్లు ఇచ్చార‌ని, ఒక్క తెలంగాణ‌లోనే 20 ల‌క్ష‌ల ఉచిత గ్యాస్ క‌నెక్షన్లు మంజూరు చేసిన‌ట్లు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ తెలిపారు. ప్ర‌ధాన‌మంత్రి సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కంలో భాగంగా నెలకు వేయి రూపాయ‌లు క‌డితే.. బాలిక‌కు 25 ఏళ్లు వ‌చ్చే నాటికి 6 ల‌క్ష‌ల 80 వేలు వ‌స్తున్నాయ‌ని, ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష యోజ‌న, ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న జ్యోతి పథ‌కాల‌తో అనుకోని ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ప్పుడు బాధితు కుటుంబాల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ తెలిపారు. ఒక మ‌హిళ‌ను ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా చేసిన ఘ‌న‌త మోదీ ప్ర‌భుత్వానికి ద‌క్కుతుంద‌ని, విదేశీ శాఖ మంత్రిగా మోదీ కేబినెట్‌లో మ‌హిళ‌ల‌కు విశిష్ట స్థానం ఉంద‌ని, కానీ తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వంలో మాత్రం మ‌హిళ‌లకు స్థాన‌మే లేకుండా పోయింద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు.ముస్లింల‌కు 12 శాతం మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌భ్య‌పెడుతూ వ‌స్తుంద‌ని, రాజ్యాంగ విరుద్ధంగా రిజ‌ర్వేష‌న్లు ఎలా క‌ల్పిస్తార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా ఒకే గూటి ప‌క్షుల‌ని, వారికి అధికారంపై ఉన్న మ‌మ‌కారం పేద‌ల‌పై లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు. ఆత్మ‌గౌర‌వ నినాదంతో కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించార‌ని, కానీ ఇవాళ స్వార్ధ‌ప్ర‌యోజ‌నాల కోసం, విలువ‌ల‌కు తిలోద‌కాలిచ్చి.. కాంగ్రెస్‌తో అంట‌కాగుతున్న విధానాన్ని చూస్తే… ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. క‌ర్ణాట‌క‌లో బిజెపి అధికారంలోకి రాకుండా.. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్న పార్టీలు   అనైతికంగా అప‌విత్ర కూట‌మిగా ఏర్ప‌డ‌టం సిగ్గుచేట‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు.ఈ నెలలో బిజెపి జ‌న‌చైత‌న్య యాత్ర‌ను నిర్వ‌హిస్తుంద‌ని, ఈ యాత్ర‌లో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ అవ‌లంభిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టి ప్ర‌జ‌ల‌ను జాగృతం చేస్తామ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ తెలిపారు. బిజెపికి మ‌ద్ద‌తుగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు క‌లిసి రావాల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ పిలుపునిచ్చారు.
Tags:BJP state unit president Dr. K Lakshman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *