కాంగ్రెస్పై భాజపాదే ‘లక్కీ డ్రా’

మథుర ముచ్చట్లు:
ఉత్తర్ప్రదేశ్ స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓవైపు మెజార్టీ స్థానాల్లో అధికార భాజపా ఆధిక్యం కొనసాగిస్తుండగా.. మథురలోని 56వ వార్డులో మాత్రం భాజపా, కాంగ్రెస్కు సరిసమానంగా 874 ఓట్లు వచ్చాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు అధికారులు లక్కీ డ్రా తీశారు. అయితే ఈ లక్కీ డ్రాలోనూ విజయం భాజపానే వరించింది. డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థిపై భాజపా అభ్యర్థి మీరా అగర్వాల్ గెలుపొందారు. స్థానిక మీడియాలో భాజపా గెలుపు ప్రకటించగానే.. సోషల్మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నెటిజన్లు కాంగ్రెస్కు చురకలంటించగా.. మరికొందరు భాజపాపై ఛలోక్తులు విసిరారు. డ్రాలోనూ కాంగ్రెస్ గెలవలేకపోయిందని..కాంగ్రెస్ తన ఒక్కసీటును కూడా కోల్పోయిందని.. అదృష్టం కూడా మోదీనే సపోర్ట్ చేసిందంటూ కొందరు కామెంట్లు చేశారు. మరికొందరేమో.. లక్కీ డ్రాను హ్యాక్ చేశారని, చిట్టీల్లో రెండూ భాజపా పేర్లే రాసి ఉంటారని అన్నారు.652 పురపాలక స్థానాలకు శుక్రవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీటిల్లో 16 నగర నిగమ్లు, 198 నగరపాలిక పరిషత్లు, 438 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో చాలా స్థానాల్లో భాజపా ముందంజలో ఉంది. నేటి సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి.
Tag : BJP’s ‘lucky draw’


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *