బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత

ముంబయి ముచ్చట్లు:
ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత శశికపూర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా సినీ రంగంలో శశికపూర్ తనదైన ముద్రవేశారు. బాలీవుడ్‌కు చెందిన కపూర్ల కుటుంబంలో శశికపూర్ సభ్యుడు. ఆయన 1938 మార్చి 18న బ్రిటిష్ పాలనలోని నాటి కలకత్తా(కోల్‌కతా)లో జన్మించారు. పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడు శశికపూర్. రాజ్‌కపూర్, షమ్మీ కపూర్లకు సోదరుడు. కరణ్ కపూర్, కునాల్ కపూర్, సంజనా కపూర్లు శశికపూర్ సంతానం. చిత్ర పరిశ్రమకు శశికపూర్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా శశికపూర్ అందుకున్నారు.శశికపూర్ నాలుగేళ్ల వయసు నుంచే నట జీవితాన్ని ప్రారంభించారు. ఆయన తండ్రి స్థాపించిన పృథ్వీ థియేటర్స్‌తో పాటు ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాటకాలలో వివిధ పాత్రలు పోషించే వారు. బాల నటుడిగా సంగ్రామ్(1950), దనపాణి(1953) వంటి కమర్షియల్ చిత్రాల్లో నటించారు.1948లో వచ్చిన ‘ఆగ్’, 1951లో వచ్చిన ‘ఆవారా’ చిత్రాల్లో తన అన్న రాజ్‌కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ధర్మపుత్ర’ చిత్రం ద్వారా నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. కేవలం హిందీ సినిమాల్లోనే కాదు..పలు ఇంగ్లిష్ చిత్రాల్లోనూ నటించారు. 1998లో చివరి సారిగా ‘సైడ్ స్ట్రీట్స్’ అనే ఆంగ్ల చిత్రంలో నటించారు.
Tag : Bollywood actor Shashi Kapoor passes away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *