మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ పాన్ ఇండియా మూవీ “బ‌బ్లీ బౌన్సర్” ప్రారంభం

హైదబాద్ ముచ్చట్లు:
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించారు. మిల్కీబ్యూటీగా అనేక ప్రేక్ష‌కుల్ని సంపాదించుకున్న త‌మ‌న్నాతో బ‌బ్లీ బౌన్సర్ అనే బాక్సింగ్ నేప‌థ్యం ఉన్న చిత్రాన్ని ముధ‌ర్ భండార్క‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చ‌ర్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తాజాగా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ మాట్లాడుతూ గ‌తంలో తాను తెర‌కెక్కించిన సినిమాల‌కు భిన్నంగా బ‌బ్లీ బౌన్స‌ర్ ఉండ‌నుంద‌ని, బాక్స‌ర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్లుగా తెలిపారు. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమాలో ఓ మ‌హిళ బౌన్స‌ర్ గా న‌టిస్తున్నార‌ని, భార‌త‌దేశంలో తొలిసారిగా ఓ మ‌హిళ బౌన్స‌ర్ క‌థ ఆధారంగా వ‌స్తున్న తొలిసినిమా ఇదే అన, ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని మధుర్ అన్నారు. అనంతరం చిత్ర క‌థ‌నాయ‌క త‌మ‌న్నా మ‌ట్లాడుతూ త‌న కెరీర్ లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్ర‌లో క‌నిపించ‌డం చాలా ఆనందంగా అనిపిస్తోంది, ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించాను. మ‌ధుర్ ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారిగా న‌టించ‌డం చాలా ఉత్కంఠగా ఉంది. ఈ సినిమాతో న‌న్ను ప్రేక్షకులు మ‌రింతగా ఆద‌రిస్తార‌ని అశిస్తున్న‌ట్లుగా తెలిపారు.
 
Tags:Bollywood director Madhur Bhandarkar launches Pan India movie “Bubbly Bouncer” as Milky Beauty Tamanna Heroine

Natyam ad