Both communities must comply: DGP Mahender Reddy

ఇరు వర్గాలు సంయమనం పాటించాలి : డీజీపీ మహేందర్రెడ్డి

Date : 17/12/2017
ఉట్నూరు ముచ్చట్లు:
ఉమ్మడి ఆదిలాబాద్లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులను డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఉట్నూరు పీఎస్లో డీజీపీ మహేందర్రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఆదివాసీలు, లంబాడీల గొడవ వెనక ఎవరో ఉన్నారని పేర్కొన్నారు. ఈ గొడవ ద్వారా మావోయిస్టులు లబ్దిపొందాలని చూసే అవకాశం ఉందన్నారు. మావోయిస్టులకు ఆ అవకాశం ఇవ్వొద్దన్నారు. ఎవరూ రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ఇరు వర్గాలు సంయమనం పాటించాలని కోరారు. సాధారణ ప్రజలకు నష్టం కలిగేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags : Both communities must comply: DGP Mahender Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *