రోడ్డు పక్కన పడుకుంటే పూడ్చిపెట్టేశారు… 

Date:19/06/2018
జబల్‌పూర్ ముచ్చట్లు:
 రోజంతా పనితో అలసిపోయి ఖాళీ మైదానంలో పడుకున్న ఒక కూలీపై అర్థరాత్రి డంపర్‌తో మట్టినిపోశారు. దీంతో అతను రాత్రంతా ఆ మట్టి కింద చిక్కుకుని విలవిలలాడిపోయాడు. ఉదయం 8 గంటల సమయంలో అటువైపుగా వెళుతున్న జనం… అక్కడ కుక్క చేస్తున్న వింత చేష్టలను గమనించి అనుమానించారు. వారంతా మట్టికింద మృతదేహం ఉందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మట్టినంతా తొలగించి చూస్తే, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి వారికి కనిపించాడు. దీంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నౌదరాబ్రిడ్జ్ హనుమాన్ మందిరం సమీపంలోని మైదానంలో చోటుచేసుకుంది. కొంతకాలంగా ఈ మైదానంలో మట్టినిపోస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బాధితుడు విజయ్‌ని గమనించకుండా అతనిపై డంపర్‌తో మట్టిని పోశారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.”
Tags:Bounded on the roadside …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *